వివక్ష అసమానతలు లేని సమాజం నిర్మిద్దాం
ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
మహానీయుల లక్ష్యాలు ఆశయాలతో కుడిన క్యాలెండర్ KVPS తీసుకురావడం అభినందనీయం
నారాయణఖేడ్ జనవరి28 న్యూస్ ఇండియా
వివక్ష లేని సమాజం కోసం మహనీయులు అంబేద్కర్ పూలే ఎంతో కృషి చేశారని అటువంటి సమాజాన్ని నిర్మిద్దాం, చదువుతోనే మహనీయుల కలలు సాకారం అవుతాయని కెవిపిఎస్ క్యాలెండర్ ఆవిష్కరణలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు గారు అన్నారు.కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) మహనీయుల 2024 క్యాలెండర్ ను *నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూరాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అయినా సమాజంలో ఇంకా వివక్ష అసమానతలు కొనసాగుతున్నాయని అన్నారు వివక్ష అసమానతలు లేనటువంటి సమాజం కోసం అంబేద్కర్ పూలే ఎందరో మహనీయులు కృషి చేశారని అన్నారు వారి త్యాగాల ఫలితమే ఈరోజు సమాజంలో మార్పులు జరిగాయని అన్నారు.చదువుతూనే అసమానతో పోతాయని అభివృద్ధి వైపు పోతామని అన్నారు మహనీయులు అంబేద్కర్ పూలే బాటలో యువకులు ముందుండి నడవాలని అన్నారు. మహనీయుల లక్ష్యాలు ఆశయాలను ప్రతిబిమించే విధంగా వారి చిత్రపటాలు నినాదాలతో కెవిపిఎస్ క్యాలెండర్ తీసుకురావడం అభినందనీయమని, క్యాలెండర్ లో ఉన్న మహనీయుల చిత్రపటాలను చూసినప్పుడు స్ఫూర్తిని కలిగిస్తాయని అన్నారు.కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కోటారి నర్సింలు మాట్లాడుతూ ఆత్మగౌరవం. సమానత్వం. కుల నిర్మూలన లక్ష్యాలతో మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ సమాజంలో నెలకొన్న అంటరానితనం వివక్ష కు వ్యతిరేకంగా కెవిపిఎస్ పోరాడుతుందని అన్నారు. కుల నిర్మూలన జరగాలంటే కులాలు మతాలకతీతంగా అందరూ కృషి చేయాలని అన్నారు. క్యాలెండర్ తీసుకురావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెల్పుతున్నాం అన్నారుఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు యస్,చిరంజీవి.కెవిపియస్ జిల్లా నాయకులు అరుణ్, మోసప్ప. సమత సైనిక్ దళ్ డివిజన్ అధ్యక్షులు రాజ్ కుమార్. మున్సిపల్ కౌన్సిలర్లు అనంత్ స్వరూప్ శేట్కార్, దారం శంకర్,వివేకనంద, ఎంపీపీ తనయుడు రమేష్ చౌహాన్. మాజీ ఎంపిటిసి పండరిరెడ్డి. యూత్ లీడర్ వినోద్ పాటిల్. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comment List