జయహో బీసీ సదస్సు కార్యక్రమానికి బ్రహ్మరధం పట్టిన బీసీలు
దోర్నాల పట్ణంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమానికి భారీగా బీసీలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఏరిక్షన్ బాబు మాట్లాడుతూ జగన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీ లకు ప్రాధాన్యత ఇవ్వలేదని, ప్రతి ఒక్కరికి అన్యాయమే జరిగిందని తెలిపారు. చంద్రబాబు హయాంలోనే బీసీలకు న్యాయం చేకూరిందని తెలిపారు. బీసీలందరు చంద్రబాబు వెంటే ఉన్నారని, అందరూ ఏకమై చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరారు.
కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నూకసాని బాలాజీ , యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు , రాష్ట్ర కార్యదర్శి మరియు కొండేపి నియోజకవర్గ పరిశీలకులు అడకా స్వాములు, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు నంది కనుము బ్రహ్మయ్య , రాష్ట్ర వాల్మీకి సమితి సభ్యులు నల్లబోతుల రామ దేవి,బీసీ నాయకులు, టిడిపి నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
Comment List