మానవత్వం చాటుకున్న మన ప్రాణదాతల ఫౌండేషన్
వ్యవస్థాపకులు మేరుగుమల్ల రాజ్..
On
ఎల్బీనగర్, జనవరి 17 (న్యూస్ ఇండియా ప్రతినిధి):* నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రాజుపేట గ్రామానికి చెందిన మొహుధాల శివ అనే యువకుడికి తీవ్ర జ్వరం వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ తో నోటి మాట బందు అయి మాట్లాడలేని స్థితిలో ఉండి నల్గొండ నిమ్స్ హాస్పటల్ లో అడ్మిట్ అయి చికిత్స పొందుతూ ఆపన్నహస్తం కోసం మన ప్రాణ దాతలు ఫౌండేషన్ నీ సంప్రదించగా వెంటనే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించండి అని బరోసా కల్పించడం జరిగింది.
అలాగే గత 5 రోజుల క్రితం చికిత్స పూర్తి చేసుకొని ఆరోగ్యం కుదుట పడ్డాకా ప్రస్తుతం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న శివ కుటుంబ సభ్యుల నీ కలిసి పరామర్శించి మన ప్రాణ దాతలు ఫౌండేషన్ తరుపున 10000/- రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమములో వ్యవస్థాపకులు మేరుగుమల్ల రాజ్, జనకి రాములు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
Views: 31
Comment List