అందరికి ఆదర్శం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ను బహుజనులు ఆదర్శంగా తీసుకోవాలి న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు 30(దగ్గుల వినోద్ రిపోర్టర్):- సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా దళిత శక్తి ప్రోగ్రాం (డీస్పీ) ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి కార్యక్రమము మడికొండ లోని డీస్పీ కార్యాలయం లో హనుమకొండ జిల్లా అధ్యక్షులు రాజేష్ మహారాజ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరి రవికృష్ణ […]
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ను బహుజనులు ఆదర్శంగా తీసుకోవాలి
న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు 30(దగ్గుల వినోద్ రిపోర్టర్):- సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా దళిత శక్తి ప్రోగ్రాం (డీస్పీ) ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి కార్యక్రమము మడికొండ లోని డీస్పీ కార్యాలయం లో హనుమకొండ జిల్లా అధ్యక్షులు రాజేష్ మహారాజ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరి రవికృష్ణ గౌడ్ గారు మరియు వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ గారు హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం వారు మాట్లాడుతూ ..350 సంవత్సరాల క్రితమే 12 వేల మంది గేరిల్లా సైన్యాన్ని సిద్ధం చేసుకుని మొగలయి సామ్రాజ్యం పై దండెత్తి మొట్టమొదటిసారి తెలంగాణలో బహుజనుల జెండా ఎగరేసిన బహుజనులకు స్వరాజ్య కాంక్షను రుచి చూపించిన గొప్ప పోరాట యోధుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు.ఆ యొక్క స్వరాజ్యకాంక్షతో
బహుజనులకు రాజ్యం రావాలి పీడిత వర్గాలు రాజ్యాన్ని పరిపాలించారని ఆలోచన తోటి తెలంగాణ రాష్ట్రంలో 10 వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేస్తున్నటువంటి
డాక్టర్ విశారదన్ మహరాజ్ 10 వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రకు పూర్తి మద్దతు తెలుపుతున్న మని ఆయన అన్నారు .ఈ కార్యక్రమం అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జై గౌడ విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిర్ర సుమన్ గౌడ్, డీఎస్పీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర కార్యదర్శి
పురేళ్ళ రమేష్, రాష్ట్ర కార్యదర్శి జితేందర్,
డీస్పీ రాష్ట్ర కమిటీ సభ్యులు చిరంజీవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List