వైసీపీ ముద్దు.. నాన్ లోకల్ వద్దు
ఉత్తరాంధ్రలో ఒక నియోజకవర్గంపై అందరి ఫోకస్ పడింది. ఎప్పుడూ నాన్ లోకల్ అభ్యర్ధులేనా ఈసారి మాకు ఛాన్స్ ఇవ్వాలంటూ పాయకరావుపేట స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సారి నాన్ లోకల్ అభ్యర్ధులకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదంటున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ పార్టీలు లోకల్ అభ్యర్ధుల కోసం వేట మొదలుపెట్టాయి. అయితే వైసీపీ నుంచి లోకల్ అబ్యర్ధి గా పెదపాటి అమ్మాజీని బరిలోకి దింపాలని బావిస్తున్నారు. అయితే టీడీపీ నుంచి లోకల్ అబ్యర్ధి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ పొత్తులో భాగంగా జనసేనకు పాయకరావుపేట సీటు కేటాయిస్తే.. లోకల్ అభ్యర్ధి ఎవరనే దానిపై ఆ పార్టీలో గందరగోళం నెలకొంది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List