నాన్ లోకల్ అభ్యర్ధి అయితే పాయకరావుపేటలో ఓటమి

పాయకరావుపేట అభివృద్ధికి ఎవరు కావాలి?

On
నాన్ లోకల్ అభ్యర్ధి అయితే పాయకరావుపేటలో ఓటమి

నియోజకవర్గంలో నాన్ లోకల్ నేతలు వద్దు వైసీపీ, టీడీపీ గుండెల్లో వణుకు స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ పార్టీలకతీతంగా తీర్మానం నాన్ లోకల్ వాళ్లకు టికెట్లు ఇస్తే ఓటమి తప్పదని స్పష్టం స్తానికంగా ఉన్న పెదపాటి అమ్మాజీకి సీటు ఖరారయ్యే ఛాన్స్ టీడీపీ నుంచి అనిత ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఉంటుుందా?

ఉత్తరాంధ్రలో లోకల్, నాన్ లోకల్ రగడ కొనసాగుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఉత్తరాంధ్రలో ఒక స్లోగన్ మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది. స్థానిక నాయకులకే టికెట్లు ఇవ్వాలని.. అయితే ఈ సారి మాత్రం నాన్ లోకల్ అభ్యర్ధులను ఖచ్చితంగా ఓడించాలనే వ్యూహంలో స్థానిక నేతలున్నారు.

 ycp
తమ నియోజకవర్గాల్లో నాన్ లోకల్ అభ్యర్ధులు వద్దంటూ వైసీపీ హైకమాండ్ కు స్థానిక నేతలు బాహాటంగానే తెగెసి చెప్తున్నారు. వ్యాపారవేత్తలకు ప్రజల మంచి చెడు ఏం తెలుసు అంటూ ఫైరవుతున్నారు. ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గంలో  నాన్ లోకల్ వద్దు అనే నినాదం వైసీపీ, టీడీపీ గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. స్థానికేతరుల పెత్తనంపై నియోజక వర్గ నేతలు ఏకమవ్వడంతో ఇన్‌ఛార్జిలు తలలు పట్టుకుంటున్నారు. గొల్ల బాబూరావుపై తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యేను మార్చాలనే వ్యూహంలో వైసీపీ ఉంది. అయితే స్థానికులకు కాకుండా బయటి వ్యక్తులకు కనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడించి తీరుతామనే నియోజకవర్గానికి సంబంధించిన నాలుగు మండలాల వైసీపీ ముఖ్య నాయకులు చెప్తున్నారు. సులభంగా గెలిచే సీటును కావాలనే నాన్ లోకల్ అభ్యర్ధికి కట్టబెడితే పార్టీ తీవ్ర ఓటమిని ఎదుర్కొక తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీని బరిలోకి దింపాలనే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉంది. అయితే టీడీపీ నుంచి అనిత నాన్ లోకల్ కార్డు అందుకుంటే.. జనసేనకు కేటాయిస్తారా లేకా.. మరొకరికి ఇస్తారా అనేదానిపై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
అయితే నాన్ లోకల్ అభ్యర్ధికి గనుక టికెట్ కేటాయిస్తే స్వయంగా ఆ పార్టీ ఓటమిని ఎదుర్కొక తప్పదని స్థానికులు చెప్తున్నారు. పాయకరావుపేట అభివృద్ధి చెందాలంటే తమ ప్రాంతం వారికే ఇవ్వాలని పార్టీలకతీతంగా చెప్తున్నారు. బయటి వ్యక్తులు గెలిచిన తర్వాత తమకు అందుబాటులో ఉండరని.. అలాంటప్పుడు నాన్ లోకల్ వారిని ఎలా గెలిపిస్తామని ప్రశ్నిస్తున్నారు. స్థానికేతరుల పెత్తనంపై నియోజక వర్గ నేతలు ఏకమవ్వడంతో ఇన్‌ఛార్జిలు తలలు పట్టుకుంటున్నారు.

ycp

Views: 35

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News