గొల్ల బాబూరావు ప్లేస్ లో ఎవరంటే?
పాయకరావుపేట బరిలో పెదపాటి అమ్మాజీ!
మార్పు మొదలైంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ కు ఎదరైన అనూహ్య ఓటమితో.. ఆంధ్ర ప్రదేశ్ లోనూ రాజకీయ వ్యూహాలు మారుతున్నాయి. తాజాగా 11 మంది అభ్యర్ధిలను మార్చిన వైసీపీ తర్వాత.. ఎస్సీ రిజర్వ్ స్థానాల్లోనూ వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని మార్చబోతోంది. అనకాపల్లి జిల్లా పాయకారవుపేట ఎస్సీ రిజర్వ్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లబాబూరావును మార్చి ఆయన స్థానంలో పెదపాటి అమ్మాజీని బరిలోకి దింపబోతోంది. పెదపాటి అమ్మాజీ లోకల్ కావడం పార్టీకి కలిసి వస్తుందని.. పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం పెదపాటి అమ్మాజీ ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ గా ఉన్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List