పదివేల రూపాయలు విలువ గల శానిటైజర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కి అందజేత
న్యూస్ ఇండియా సత్తెనపల్లి
హాస్పటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కొత్త రామకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు 10 వేల రూపాయలు విలువగల శానిటైజర్స్ వారి మిత్రులు తెమ్మండ్రు రవి సహాయంతో హాస్పిటల్ కి అందజేశారు
హాస్పటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కొత్త రామకృష్ణ మాట్లాడుతూ ప్రతిరోజు ల్యాబ్ కి సుమారు 400 మంది టెస్టులు నిమిత్తం వస్తుంటారని హాస్పటల్ ల్యాబ్ లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్స్ కి శానిటైజర్స్ ఎంతో అవసరం ఉందని మేము అడగ్గానే స్పందించి పదివేల రూపాయలు విలువ గల శానిటైజర్స్ అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు
డాక్టర్ సుమిత్ర మాట్లాడుతూ హాస్పటల్ అభివృద్ధి కమిటీ ఎంతో సేవా దృక్పథంతో పనిచేస్తుందన్నారు అవసరం ఉన్న చోటల్లా అవసరాలు తీరుస్తూ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారని కొత్త రామకృష్ణ ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో హాస్పటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కొత్త రామకృష్ణ, డాక్టర్ సుమిత్ర, లాబ్ టెక్నీషియన్ ఆలీ, ల్యాబ్ టెక్నీషియన్ చందు, ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ పాల్గొన్నారు
Comment List