పాలకుర్తి మండలంలో నూతన ఆసరా పెన్షన్లు

On

పాలకుర్తి మండలంలో నూతన ఆసరా పెన్షన్లు కార్డులు పంపిణీ చేసిన ఎంపిపి నల్లా నాగిరెడ్డి 57 సంవత్సరాలకు కొత్త పెన్షన్లు మంజూరు న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు 30 (జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తాళ్ళపల్లి వెంకన్న గౌడ్): జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తీగారం, చీమలబాయితండ, విస్నూర్, మైలారం,చెన్నూర్,గుడికుంటతండ,మంచుప్పుల,ముత్తారం,వల్మీడి,సిరిసన్నగూడెం,కొండాపురం,పెద్దతండ(కె), తండ, గ్రామాలలో నూతన ఆసరా పెన్షన్ కార్డులను జిల్లా జడ్పీ ప్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాస్ రావు మరియు పాలకుర్తి ఎంపీడీవో వనపర్తి అశోక్ కుమార్ తో […]

పాలకుర్తి మండలంలో నూతన ఆసరా పెన్షన్లు
కార్డులు పంపిణీ చేసిన ఎంపిపి నల్లా నాగిరెడ్డి

57 సంవత్సరాలకు కొత్త పెన్షన్లు మంజూరు

న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు 30 (జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తాళ్ళపల్లి వెంకన్న గౌడ్): జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తీగారం, చీమలబాయితండ, విస్నూర్, మైలారం,చెన్నూర్,గుడికుంటతండ,మంచుప్పుల,ముత్తారం,వల్మీడి,సిరిసన్నగూడెం,కొండాపురం,పెద్దతండ(కె), తండ, గ్రామాలలో నూతన ఆసరా పెన్షన్ కార్డులను జిల్లా జడ్పీ ప్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాస్ రావు మరియు పాలకుర్తి ఎంపీడీవో వనపర్తి అశోక్ కుమార్ తో కలిసి పంపిణీ చేసిన ఎంపీపీ నల్లా నాగిరెడ్డి,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ ప్రభుత్వంలో,పేదల జీవితానికి భరోసాతో’పాటు,ఆత్మగౌరవాన్ని కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకాన్ని అమలు చేసిందని,ఇచ్చిన హామీ ప్రకారం 57 సంవత్సరాలకు పెన్షన్లు,వృద్ధులకు,వితంతులకు,గీత కార్మికులకు,చేనేత,బీడీ కార్మికులకు,బోదకాలు, హెచ్ఐవి,ఒంటరి మహిళలకు, డయాలసిస్ రోగులకు, 2016/- రూపాయలు, వికలాంగులకు 3016/- అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముస్కు రాంబాబు
చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్,ఎండి మదార్ జడ్పీ కోఆప్షన్ సభ్యులు,మాచర్ల ఎల్లయ్య మండల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎర్రబెల్లి రాఘవరావు
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్,బేతి సాంబన్నమంత్రి పిఎ మరియు వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News