పాలకుర్తిలో హరీష్ రావు రోడ్ షో

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి ఎర్రబెల్లి.దయాకర్ రావుకి మద్ధతుగా నిర్వహించిన రోడ్ షో..

By Venkat
On
పాలకుర్తిలో హరీష్ రావు రోడ్ షో

హరీష్ రావు,దయాకర్ రావు

ఆపదలో ఆదుకున్న, తలలో నాలుకలా ఉండే దయాకర్ రావు గెలవాలా

ఓట్ల ముందట నోట్ల కట్టలు పట్టుకొచ్చిన అమెరికా ఎన్నారైలు గెలవాలా

కరోనా సమయంలో దయన్న పోరాడిండు.

నాతో కొట్లాడి స్పెషల్ కోటాలో మందులు తెచ్చుకుని ప్రజలను కాపాడుకున్నడు

Read More ఘనంగా వినాయక చవితి వేడుకలు*

ప్రతీ గల్లీకి సీసీ రోడ్లు, ఇంటింటికీ మంచి నీళ్లు ఇచ్చిండు దయాకర్ రావు ఆపోజిట్ అభ్యర్ధి అమెరికాలో విల్లాలు గిఫ్ట్‌గా ఇచ్చి టిక్కెట్లు కొన్నరని కాంగ్రెసోళ్లే అంటున్నరు.దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ స్పూర్తి నిండిన పాలకుర్తి ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరు.డబ్బులున్నయని కాంగ్రెసోళ్లకు అహంకారం. దాంతో లీడర్లను కొంటరు కానీ ప్రజలను కొనలేరు. దయన్న గెలుపును నోట్ల కట్టలు అడ్డుకోలేవు.కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అని చెప్పి ఉన్న గోసి ఊడపీకిర్రు నమ్మితే మోసపోతం, పాపమంటే గోస పడ్తం.కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాల్నా కరెంట్ కావాలంటే దయన్నకు ఓటు గుద్దాలి.కాంగ్రెసోళ్లు ప్రతీ రైతుకు 15వేలు అంటున్నరు. కేసీఆర్ మాత్రం ఎకరాకు 16 వేలు ఇస్తడు. 12 సార్లు రైతుబంధు ఇచ్చిన కేసీఆర్ గెలవాల్నా 12 మంది ముఖ్యమంత్రులు ఉన్న కాంగ్రెస్ గెలవాల్నా ఓడినోడు నేనే ముఖ్యమంత్రి అంటడు, గెలిచినోడు నేనే ముఖ్యమంత్రి అంటడు. ఇలాంటి కాంగ్రెస్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టి రిస్క్ తీసుకుందామా గతంలో తండాలకు కరెంటు లేదు, నీళ్లు రావు, రోడ్డు లేకుండే. కానీ దయాకరన్న గెలిచిన తర్వాత డాంబర్ రోడ్డు, ఇంటింటికీ నీళ్లు, 24గంటల కరెంట్ వచ్చింది. ముఖ్యంగా తండాలు గ్రామపంచాయితీలు అయినయి. తండాలు గ్రామపంచాయితీలు చేస్తమని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. ఎల్ హెచ్ పీఎస్ వాళ్లు ఏళ్ల తరబడి కొట్లాడిండ్రు. కానీ కేసీఆర్ దాన్ని నిజం చేసిండు. లంబాడీల కలను నెరవేర్చిండు.గిరిజనులకు శుభవార్త. ఈ సారి దయాకర్ అన్నను గెలిపిస్తే అందరికీ గిరిజన బంధు అమలు చేస్తాం.దయాకర్ అన్న మంచి మనిషి. గుణమున్న వ్యక్తి. ఆపద వచ్చినప్పుడు సాయం చేసే మనిషి.కాంగ్రెసోళ్లు నోట్ల కట్టలతో విమానం దిగంగనే చూసి ఆగమవుతామా దయన్నని గెలిపించి ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. పాలకుర్తి పవర్ ఫుల్ గా ఉండాలంటే దయన్నని గెలిపించాలి.నిన్న ప్రియాంకా గాంధీ వచ్చింది. ఆమె సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో 403 నియోజకవర్గాలు ఉంటే కేవలం 2 మాత్రమే గెలిచింది కాంగ్రెస్. అక్కడ ఎన్నికల ఇంఛార్జ్ ప్రియాంక గాంధీనే. ఈమెను సొంత ప్రజలే ఓడించిండ్రు. అలాంటి మనిషి ఇక్కడికొచ్చి చెప్తే ఓటేస్తామా కాంగ్రెస్ వస్తే కరువు వస్తది. కాంగ్రెస్ వస్తే రైతుబంధు పోతది. కాంగ్రెస్ వస్తే కరెంట్ కట్ అయితది.కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో ఉంటే కేసీఆర్ కి హైకమాండ్ ప్రజలే. మన ఇంటి పార్టీ, మన కేసీఆర్ ని మూడోసారి గెలిపించుకుందాం.IMG-20231125-WA1363

Read More మాజీ మంత్రులపై దాడి చేయడం సరైన పద్ధతి కాదు

Views: 41
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వినాయక చవితి వేడుకలు* ఘనంగా వినాయక చవితి వేడుకలు*
*ఘనంగా వినాయక చవితి వేడుకలు* *న్యూస్ ఇండియా పెబ్బేర్* నవరాత్రులు పురస్కరించుకుని పెబ్బేర్ మున్సిపాలిటీ పెబ్బేర్ మండల పరిధి గ్రామాలలో వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా...
జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ