ఖేడ్ లో బీజేపీ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి

అభివృద్ధి చేసి చూపిస్తా

On
ఖేడ్ లో బీజేపీ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి

ఖేడ్ అభ్యర్థి జెనవాడే సంగప్ప

IMG-20231123-WA0047కంగ్టి,న్యూస్ ఇండియా  

నారాయణఖేడ్లో బీజేపీ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి కౌలాస్ నాల్లా నీళ్లు కంగ్టి మండలానికి తీసుకొచ్చే బాధ్యత నాదని ఖేడ్ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే జెనవాడే సంగప్ప అన్నారు.రైతుల సంక్షేమం కోసం పంట పొలాలకు సాగు తాగు నీరందిస్తానని సంగప్ప పేర్కొన్నారు.గురువారం స్థానిక మండల కేంద్రంలో బోర్గి, చౌకన్ పల్లి,దెగుల్ వాడీ, రాంతీర్థ్,ఎన్కేమూరి,సిద్ధ హంగీర్గ తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఖేడ్ లో యువతకు ఉపాధి అవకాశాలు లేక పొట్టకూటి కోసం వలసలు వెళ్తున్న ఫ్యాక్టరీలు తేలేని దద్దమా పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ లు సంగప్ప విమర్శించారు.గారిబోడి బిడ్డగా మాటిస్తున్న ఖేడ్ రూపు రేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు రాష్ట్రంలో కేసీఆర్ పథకాలు అని ప్రచారం చేసుకుంటున్నాడు సిగ్గుండాలే అధికార పార్టీ లీడర్లకు అన్నారు.ప్రధాని హయాంలోనే దేశం, రాష్ట్రాలు అన్ని రంగాల్లో డవలప్ మెంట్ చెందుతున్నాయని ప్రజలు అలోచించి ఓట్లు వెయ్యాలన్నారు.పేద ప్రజల సంక్షేమం కోసమే పార్టీలోకి వచ్చాన్నారు.కరోనా కష్టకాలంలో మోడీ టీకాలు తెచ్చి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చిన ఘనత మోడీ దాని సంగప్ప గుర్తు చేశారు.వచ్చే నెలలో అయోధ్య రామ మందిరం ఓపెన్ ఉందని ప్రతి ఒక్కరికి ఫ్రీగా దర్శనం చేసేందుకు కృషి చేస్తానని సంగప్ప మాట ఇచ్చారు.అవినీతి,అరాచక పాలనను అంతం మొందించాలని సంగప్ప కోరారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు, లీడర్లు పాల్గొన్నారు.

Views: 196

About The Author

Post Comment

Comment List

Latest News