మంచిరెడ్డి తీరుపై మండిపడ్డ మునగనూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు..

On

మంచిరెడ్డి తీరుపై మండిపడ్డ మునగనూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు..

IMG_20231121_20585026
మీడియాతో మాట్లాడుతున్న మునగానూరు మాజీ సర్పంచ్ నక్క రాధిక శ్రీనివాస్ గౌడ్..

అబ్దుల్లాపూర్మెట్టు, నవంబర్ 21 (న్యూస్ ఇండియా తెలుగు): ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు గ్రామంలో పోలీసుల పర్యవేక్షణలో ప్రచారం నిర్వహించిన ఇబ్రహీంపట్నం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి తీరుపై మునగనూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధ్వజమెత్తారు గత 15 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కిషన్ రెడ్డి ఎటువంటి అభివృద్ధి చేయకుండా కల్లబొల్లి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసగించారని ఆరోపించారు. మునగనూరులో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాడని ఇప్పుడు మళ్లీ మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. అంతేకాకుండా గ్రామానికి మంచినీటి సమస్య ఆర్టీసీ బస్సుల సమస్యల తో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటివరకు గ్రామంలో ఒక్క కొత్త రేషన్ కార్డు గాని ఒక్క కొత్త పెన్షన్ గాని ఒక్క డబల్ బెడ్ రూమ్ ఇల్లు గాని ఇవ్వకుండా అంతా అభివృద్ధి చేశామని పోలీసు బలగాలతో గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తున్న కిషన్ రెడ్డికి ఈసారి ఎన్నికల్లో ఓటు తో బుద్ధి చెప్తామని సవాల్ చేశారు. అనంతరం కొందరు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మాజీ సర్పంచ్  శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మునగనూరు మాజీ సర్పంచ్ నక్క రాధిక శ్రీనివాస్ గౌడ్, గుల్జాన్ కుమార్ గౌడ్, దోమలపల్లి అంజయ్య, దోమలపల్లి లక్ష్మణ్, వెంకట్ రెడ్డి, కుమార్ గౌడ్, దోమలపల్లి నర్సింగ్, వాసు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 16

About The Author

Post Comment

Comment List

Latest News