ప్రచార హోరు.. బిఆర్ఎస్ జోరు..
జనగామ బిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ని అధిక మెజార్టీతో గెలిపించాలి...
గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న గులాబీ దళాలు... ప్రభుత్వం చేపట్టిన పథకాలను గడపగడపకూ వివరిస్తూ ప్రచారం..
నవంబర్ 21, న్యూస్ ఇండియా తెలుగు (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)
జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.బిఆర్ఎస్ జనగామ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ని అధిక మెజార్టీతో గెలిపించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు.తమ సర్కార్ పింఛన్లను పెంచిందని, సౌభాగ్య లక్ష్మీ కింద మహిళలకు మూడు వేలు ఇవ్వనున్నట్లు, గ్యాస్ ధరను 400 కు ఇవ్వనున్నట్లు ,రేషన్ కార్డు ఉన్నవారికి సన్న బియ్యం ఇవ్వనున్నట్లు ,కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ కేసీఆర్ సర్కార్ను తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు...
Comment List