క్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థిని విద్యార్థులకు విజ్ఞానం పెరుగుతుంది

By Khasim
On
క్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థిని విద్యార్థులకు విజ్ఞానం పెరుగుతుంది

యర్రగొండపాలెం మండలంలోని వాదంపల్లి గ్రామంలోని ఎంపీయూపి స్కూల్ విద్యార్థులు క్షేత్ర ప్రదర్శనలలో భాగంగా బుధవారం యర్రగొండపాలెంలోని వివిధ మండల కార్యాలయాలను సందర్శించి వాటి విధివిధానాలను తెలుసుకోవడం ద్వారా విద్యార్థిని,విద్యార్థులకు విజ్ఞానం పొందవచ్చని ఎంఈఓ ఆంజనేయులు తెలిపారు. ఇలాంటి విజ్ఞానం తో పాటు మంచి అనుభూతి, ఆనందం కలుగతుందని, ఇవి చదువులో ముందుకు సాగడానికి దోహదపడతాయి అన్నారు .పోలీస్ స్టేషన్, తహసిల్దార్ కార్యాలయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,మండల ప్రజా పరిషత్ కార్యాలయం, అగ్నిమాపక కేంద్ర కార్యాలయము, మండల విద్యా వనరుల కేంద్రం లను సందర్శించడం అయినది.ఈ సందర్భంగా మండల అధికారులైన పట్టణ ఎస్సై జి కోటయ్య,తహసీల్దార్ రవీంద్రారెడ్డి, ఎంపీడీవో నాగేంద్ర ప్రసాద్, ఎస్బిఐ మేనేజర్ నాగరాజు, మరియు ఎంఈఓ లు ఆంజనేయులు మరియు మల్లు నాయక్ విద్యార్థులకు ప్రభుత్వ కార్యాలయాల గురించి వాటి ప్రాధాన్యత మరియు ఆవశ్యకత గురించి తెలిపి పౌరులుగా మన బాధ్యత ఎలా ఉండాలో తెలియజేయడమైనది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పబ్బిశెట్టిమంజులా, శ్రీను,పిఎంసి చైర్మన్ చెన్నకేశవులు,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.నాగరాజు, ఉపాధ్యాయులు అల్లూరి శ్రీను, రాజేంద్రప్రసాద్, 35మంది 6,7, 8తరగతి విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 67
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News