16 నెలలుగా మాట తప్పని అమ్మా ఫౌండేషన్
న్యూస్ ఇండియా గిద్దలూరు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రెడ్డిచర్ల గ్రామంలో సీమోను(105) అనే వృద్దుడు సరైన వసతి లేని పక్షంలో అనారోగ్యంతో జీవనం సాగిస్తున్నారు.అది గమనించిన అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోనేని వెంకటేశ్వర్లు వృద్ధునికి జీవితకాలం శాశ్వత పించన్ అమ్మ ఫౌండేషన్ తరపున అందిస్తామని స్థానికుల ఆధ్వర్యంలో హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీ ప్రకారం నవంబర్ నెల పించన్ అమ్మ ఫౌండేషన్ సభ్యుడు పప్పిశేట్టి వీరేంద్ర బాబు వృద్దుడు ఉండే ప్రదేశానికి వెళ్లి అందజేశారు.ఈ సంధర్బంగా బొర్రా ఈశ్వర కుమార్ మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 16 నెలలుగా వృద్ధుని పించన్ అందజేస్తున్నట్లు తెలిపారు.అలానే వృద్ధుని పరిస్థితిని గమనించి అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పించన్ అందజేయుటకు సహకరించిన అమ్మ ఫౌండేషన్ సేవా సంస్థ టీం సభ్యుడు కర్నూల్ జిల్లా కోటపాడు గ్రామానికి చెందిన తాళ్లూరి వెంకటేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.అలానే గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో నిస్సహాయ స్థితిలో ఎవరైనా ఉంటే అమ్మ ఫౌండేషన్ దృష్టికి తీసుకురావాలని అటువంటి వారికి అమ్మ ఫౌండేషన్ అండగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ సభ్యులు, పపిషెట్టి వీరేంద్ర బాబు , బొర్రా ఈశ్వర్ కూమర్, అవిసినేని శ్రీనివాసులు, గొంగటి నాగ భీమశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comment List