కారు గుర్తుకు ఓటు వేయండి మరింత అభివృద్ధికి పాటుపడండి
ఎన్నికల ప్రచారం చేస్తున్న ఫైళ్ళ శేఖర్ రెడ్డి
కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి శేఖర్ రెడ్డి ఈ సందర్భంగా భువనగిరి నియోజకవర్గం లోని వలిగొండ పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డి స్థానిక శ్రీ రేణుకఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టణంలోని బీసీ కాలనీలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనుక్షణం పాటుపడుతుందని, ఆంధ్ర పాలకుల కబంధహస్తాలలో నలిగిపోతున్న ప్రజల బ్రతుకులు మారాలని , ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక మేరకు 2014 18లో లాగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మండల ప్రజలను ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు సర్పంచులు పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
Comment List