విజయదశమి సందర్భంగా పోలీస్ స్టేషన్లో ప్రత్యేక ప్రార్థనలు
On
బేస్తవారిపేట న్యూస్ ఇండియా
విజయదశమి పర్వదిన వేడుకలు ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం లోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై బి.నరసింహా రావు ఆధ్యక్ష్యతన అత్యంత ఘనంగా జరిగాయి. మంగళవారం పోలీస్ స్టేషన్లో జరిగిన దసరా ప్రత్యేక పూజల్లో మండలం లోని పోలీసులు పాల్గొన్నారు.పోలీస్ స్టేషన్ లోని ఆయుధ,వాహన, షమీ పూజలు వేద పండితుల మంత్రం మధ్య ఘనంగా నిర్వహించారు.అనంతరం ఒకరికొకరు విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
Views: 148
Comment List