గొల్ల బాబూరావును వెంటాడుతున్న గతం

వైసీపీ హైకమాండ్ ను దెబ్బ కొడతానని గతంలో వ్యాఖ్యలు

On
గొల్ల బాబూరావును వెంటాడుతున్న గతం

బాబూరావు మాటల్ని గుర్తు చేసుకుంటున్న పార్టీ కేడర్ వివాదస్పద వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా.. వైసీపీతో అంటీముట్టనట్లుగానే ఉంటున్న ఎమ్మెల్యే

golla 3పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావును గతం వెంటాడుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆయన వర్గంలో టెన్షన్ ఎక్కువైపోతోంది. అటు వైసీపీ కార్యకర్తలతో ఆయన వ్యవహరించిన తీరును ఇప్పుడు పలువురు చర్చించుకుంటున్నారు.  గతంలో ఓ సందర్భంలో వైసీపీ అధిష్టానం మంత్రి పదవి విషయంలో తనను దెబ్బ కొట్టిందని, తానూ అవకాశం వచ్చినప్పుడు దెబ్బ కొడతానంటూ చేసిన వ్యాఖ్యలు స్థానికంగా సంచలనంగా మారాయి. కోటారవుట్లలో గొల్ల బాబూరావు  వాలంటీర్ల సన్మాన కార్యక్రమం సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ కావడంతో అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో  మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు.అయితే ఆ తర్వాత ఆయన ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్న పార్టీ కేడర్ లో, పార్టీ హైకమాండ్ లో ఆయన ఇమేజ్ డ్యామేజ్ కాక తప్పలేదు. 
అటు వైసీపీ కార్యకర్తల్ని పట్టించుకోకుండా టీడీపీ కేడర్ తో రాసుకుపూసుకుతిరుగుతుండటం కూడా వైసీసీకి ఇరకాటంగా మారింది. 
అప్పట్లోనే వైసీపీకి చెందిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి గొల్ల బాబూరావుకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు.బాబూరావు మొఖం చూడబోమంటూ ప్రతిజ్ఞ బూనారు. తమను వైసీపీ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, పురుగుల్లా చూస్తున్నారని వారు ఆరోపించారు. దీనిపై అధిష్టానం కూడా దృష్టి సారించింది. సిట్టింగ్ అభ్యర్ధిని మారుస్తారనే ఖచ్చితమైన సమాచారంతో ముందస్తుగానే బాబూరావు అన్ని సర్దుకుంటున్నారని సమాచారం. 

Views: 173

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News