బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ భారతి హోలీకేరీ
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా భారతి హోలీకేరీ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 4 గంటల సమయంలో సమీకృత సాయంత్రం జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న నూతన జిల్లా పాలనాధికారికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన ఛాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కొత్త కలెక్టర్ గాలు బాధ్యత స్వీకరించిన సందర్భంగా జిల్లా పాలనాధికారిని ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు. అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, భూపాల్ రెడ్డి, డిఆర్ఓ సంగీత, కలెక్టరేట్ ఏ.ఓ ప్రమీల, కలెక్టర్ కు పూల బొకేలు అందించి స్వాగతం పలికారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List