బీసీ కులసంఘాల ముఖ్యనాయకులతో సమావేశం..
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ..
బీసీ కులసంఘాల ముఖ్య నాయకుల సమావేశం..
తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల ముఖ్య నాయకుల సమావేశం బుధవారం కర్మన్ఘట్ లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వారి అభివృద్ధికి పాటుపడుతున్నదని అన్నారు. బీసీలకు బీసీ బందు ఆత్మగౌరవ భవనాలు వృత్తిదారులకు పనిముట్లకు ఆర్థిక సాయం విద్యార్థులకు విదేశీ విద్య మొదలగు కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేయడం జరుగుతుందని తెలిపారు. ఎల్బీనగర్ ట్రాఫిక్ రద్దని తగ్గించడానికి ఫ్లైఓవర్లు, అండర్పాస్ లు నిర్మించి సిగ్నల్ ఫ్రీ రహితంగా మార్చాము,118 జీవో తీసుకొచ్చి యు.ఎల్.సి సమస్యలను పరిష్కరించాము, ఆస్తి పన్నులు తగ్గించాము అదేవిధంగా ఫ్రూట్ మార్కెట్ ను తరలించి ఆ స్థలంలో వెయ్యి పడకల ఆసుపత్రిని, 27 అంతస్తులతో 1200 కోట్లతో నిర్మాణం చేపట్టామన్నారు. అనంతరం సమావేశానికి అధ్యక్షత వహించిన ఓరుగంటి వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం పాక్ చేయించి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ బిజెపి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం శోచనీయమని అన్నారు. బిచ్చం ప్రజలకు అందుబాటులో ఉంటు ఎల్బీనగర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సుధీర్ రెడ్డినే వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కుంట్లూరు వెంకటేష్ గౌడ్, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రాచమల్ల బాలకృష్ణ, ముదిరాజ్ సంఘం కావలి నరసింహ ముదిరాజ్, ఢిల్లీ గోపాల్, కుమ్మరి సంఘం నాయకులు దూగుంట నరేష్, యాదవ్ సంఘం నాయకులు నారగోని శ్రీనివాస్ యాదవ్, సాగర ఉప్పర సంఘం అధ్యక్షులు అమరేందర్ సాగర్, పెరిక సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బొలిశెట్టి సతీష్ కుమార్, కుర్మ సంఘం నాయకులు నర్రె శ్రీనివాస్, గంగిరెద్దుల సంఘం అధ్యక్షులు నరసింహ, రజక సంఘం నాయకులు పగడాల ఎల్లన్న, బీఆర్ఎస్ నాయకులు రాహుల్ గౌడ్, విజయ్ గౌడ్, జిల్లెల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comment List