అబ్దుల్లాపూర్మెట్ డిప్యూటీ తాసిల్దారుగా వై రామకృష్ణ
On
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం లో ఎమ్మార్వో రవీందర్ దత్తు సమక్షంలో డిప్యూటీ తాసిల్దారుగా వై. రామకృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంతకుముందు శంషాబాద్ మండలంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసి ఇప్పుడు ప్రమోషన్ లో అబ్దుల్లాపూర్మెట్ మండలంకు డిప్యూటీ తాసిల్దార్ గా రావడం తనకు ఎంతో సంతోషకరంగా ఉందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాసిల్దార్ కార్యాలయంలో పనులు సజావుగా జరగడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేశారు. సోమవారం పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను వారు పంపిణీ చేశారు.
Views: 199
Tags:
Comment List