త్వరలో ఆటోనగర్ ఇసుక లారీల అడ్డా తొలగింపు..

ఎల్బినగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి..

On
త్వరలో ఆటోనగర్ ఇసుక లారీల అడ్డా తొలగింపు..

IMG-20230930-WA0817
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, టీ.ఎస్.ఐ.ఐ.సి ఎండి.

ఆటోనగర్ ఇసుక లారీల అడ్డా తొలగింపు భాగంగా శనివారం టీ.ఎస్.ఐ.ఐ.సీ (TSIIC) ఎండి నర్సింహారెడ్డి ని  ఎల్బినగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వారి కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి ఇట్టి ఇసుక లారీల అడ్డా వల్ల దాదాపు చుట్టుపక్కల ఉన్న15 కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని వారికి వివరించారు. మహిళలు, వృద్ధులు రాత్రి పూట అటువైపు నుంచి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు. ఆటోనగర్ లోపల దాదాపు 11 ఎకరాల స్థలంలో లారీలు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని సుధీర్ రెడ్డి కోరడం జరిగింది. వారు వెంటనే అనుమతి ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే లారీల బెడద నుండి ప్రజలకు పూర్తి స్థాయిలో విముక్తి లభిస్తుంది అని తెలిపారు. రాబోయే రోజుల్లో రోడ్డు మీద ఇసుక లారీలు ఆగకుండా చూసుకోవడం జరుగుతుంది అని తెలిపారు. నూతనంగా కేటయించే స్థలంలో వారికి కనీస సౌకర్యాలు అయిన మంచినీటి సౌకర్యం, మూత్రశాలలు, పడుకోవడానికి తగిన వసతులు కల్పించలని కోరారు. రెండు రోజుల్లో అట్టి ఆటోనగర్ లారీల అడ్డ వద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. దానికి మీరు కూడా రావాలని సుధీర్ రెడ్డి, నర్సింహారెడ్డి ని కోరారు. వారు తప్పకుండా వస్తాము అని తెలిపారు. అలాగే గత కొన్ని రోజుల క్రితం ఆటోనగర్ పారిశ్రామిక ప్రాంతంలో నూతన రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడం జరిగింది. అయితే రోడ్డు వెడల్పు 7 మీటర్ల నుంచి11 మీటర్ల వరకు వెడల్పు పెంచాలని కోరారు. వారు మాట్లాడుతూ తప్పకుండా రోడ్డు వెడల్పు విషయం గురించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రధానమైన సమస్యలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, హయత్ నగర్ డివిజన్ బారాస పార్టీ అధ్యక్షులు చెన్నగొని శ్రీధర్ గౌడ్, హయత్ నగర్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి యానాల కృష్ణారెడ్డి, శ్రావణ్, లక్ష్మణ్ రెడ్డి, శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి, జలందర్ రెడ్డి, సుధాకర్, ప్రవీణ్ గౌడ్, సత్తిరెడ్డి పలువురు కాలనీవాసులు, అధికారులు పాల్గొన్నారు.

Views: 170
Tags:

About The Author

Post Comment

Comment List