టీఎస్ మీసా హం సాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం
మిలాద్ ఉన్ నబీ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భగా
తెలంగాణ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్
మిలాద్ ఉన్ నబీ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా జనగామ ఏరియా హాస్పిటల్ లో టీఎస్ మీసా తెలంగాణ మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ మరియు హంసాత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా ఏసీపీ కె.దేవేందర్ రెడ్డి,సిఐ శ్రీనివాస్,28వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ సమద్,డాక్టర్ సుగుణా కర్ రాజు,కో ఆప్షన్ సభ్యులు మసీ ఉర్ రహమాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఎసిపి కె.దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ జనగామ ప్రాంతంలో హిందూ ముస్లింలు అన్నదమ్ముల కలిసి ఉంటారని రక్తదానంతో ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చని,మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా టీఎస్ మీసా,హంసాత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లింలు మరియు కులమతాలకు అతీతంగా రక్తదానం చేస్తున్నందుకు వారిని అభినందించారు.బిఆర్ఎస్ జనగామ పట్టణ మహిళా అధ్యక్షురాలు చెంచారపు పల్లవి రక్తదానం చేసి వారి ఔదార్యాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో టీఎస్ మీసా జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అంకుశవాలి,హం సాత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ యాకుబ్ పాషా,టీఎస్ మీసా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ జలీల్,కోశాధికారి మహమ్మద్ హఫీజ్,రాష్ట్ర బాధ్యులు మహమ్మద్ తహసీన్,మహమ్మద్ ఖాజా ముజ్తహిదుద్దీన్,మహమ్మద్ నూరుద్దీన్,మహమ్మద్ ఖలీల్,హైమద్ మహమ్మద్,అన్వర్ షరీఫ్,ముజీపూర్ రహమాన్,మేరాజూర్ రహమాన్,అబ్దుల్ రహీం,జాంగిర్,బబ్లు అంజత్ తదితరులు పాల్గొన్నారు.
Comment List