ప్రాణాలు తీస్తున్న కులాంతర వివాహాలు
ఇతర కులాలవారిని వివాహమాడుతున్నందుకు ఏటా వందల మంది హత్యలకు గురవుతున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తంచేశారు. నైతికత విషయంలో బలహీన వర్గాలపై ఆధిపత్యం ఉందని తెలిపారు. మతమార్పిడులకు వ్యతిరేకంగా యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కఠిన చట్టాలు తీసుకొస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అనంతరం ‘చట్టం-నైతికత’ అన్న అంశంపై ఆయన అశోక్ దేశాయ్ స్మారక ప్రసంగం చేశారు. కులాంతర వివాహాలు బలిపీఠాలుగా మారుతున్నాయంటూ.. చట్టం, నైతికత, వర్గాల […]
ఇతర కులాలవారిని వివాహమాడుతున్నందుకు ఏటా వందల మంది హత్యలకు గురవుతున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తంచేశారు.
నైతికత విషయంలో బలహీన వర్గాలపై ఆధిపత్యం ఉందని తెలిపారు.
మతమార్పిడులకు వ్యతిరేకంగా యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కఠిన చట్టాలు తీసుకొస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
అనంతరం ‘చట్టం-నైతికత’ అన్న అంశంపై ఆయన అశోక్ దేశాయ్ స్మారక ప్రసంగం చేశారు.
కులాంతర వివాహాలు బలిపీఠాలుగా మారుతున్నాయంటూ.. చట్టం, నైతికత, వర్గాల హక్కుల నడుమ విడదీయలేని దృఢబంధాన్ని ఈ సందర్భంగా వివరించారు.
చట్టం బాహ్య సంబంధాలను క్రమబద్ధీకరిస్తుంది. నైతికత అంతర్గత జీవితాన్ని, కోరికలను.. మన అంతరంగాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది
సమాజంలోని కొన్ని వర్గాలకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఈ వివక్షలు ఉంటున్నాయి. మహారాష్ట్రలో పుస్తకాలు, నాటకాలపై నిషేధం, డ్యాన్స్ బార్లపై ఆంక్షలు ఇందుకు ఉదాహరణలు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List