రోడ్డుప్రమాదం..16 మంది జవాన్లు మృతి..కేసీఆర్ సంతాపం
నార్త్ సిక్కింలో ఘోర ప్రమాదం సంభవించింది. జెమా సమీపంలో ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురై 16 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు సీజేఓలు, 13 మంది జవాన్లు ఉన్నాయి. మరో నలుగురు జవాన్లు గాయపడటంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి హెలికాప్టర్‌లో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మూడు ఆర్కీ వాహనాల కాన్వాయి థాంగు వైపు వెళ్తుండగా ఒక ట్రక్కు మలుపు తిరుగుతూ ప్రమాదవశాత్తూ లోయలోకి జారిపడింది. నార్త్ సిక్కింలోని జైమా వద్ద, […]
నార్త్ సిక్కింలో ఘోర ప్రమాదం సంభవించింది. జెమా సమీపంలో ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురై 16 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
వీరిలో ముగ్గురు సీజేఓలు, 13 మంది జవాన్లు ఉన్నాయి. మరో నలుగురు జవాన్లు గాయపడటంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి హెలికాప్టర్‌లో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
మూడు ఆర్కీ వాహనాల కాన్వాయి థాంగు వైపు వెళ్తుండగా ఒక ట్రక్కు మలుపు తిరుగుతూ ప్రమాదవశాత్తూ లోయలోకి జారిపడింది.
నార్త్ సిక్కింలోని జైమా వద్ద, విధి నిర్వహణలో వున్న ఆర్మీ జవాన్లు అధికారులు ప్రయాణిస్తున్న వాహనం, ప్రమాదవశాత్తూ లోయలో పడిన ఘోర ప్రమాదంలో, ప్రాణ నష్టం జరగడం పలువరు తీవ్రంగా గాయపడడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటనలో 16 మంది జవాన్లు మృతి చెందడం పట్ల సిఎం కెసిఆర్ సంతాపం ప్రకటించారు. ఆర్మీ జవాన్లు అధికారుల కుటుంబాలకు సిఎం కెసిఆర్ తన సానుభూతిని తెలిపారు.
మృతి చెందిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు తగు విధంగా వైద్యసేవలందించాలని సిఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List