రణరంగంగా మాచర్ల
పల్నాడు జిల్లా మాచర్ల రణరంగంగా మారింది. శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో దాడి చేశారు. మాచర్లలో శుక్రవారం సాయంత్రం ఇదేం ఖర్మ…రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం కార్యకర్తలు స్థానిక రింగురోడ్డు నుంచి ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో మున్సిపల్ ఆఫీసు దగ్గర వైసీపీ శ్రేణులు భారీగా మొహరించారు. చిన్న కాన్వెంట్ దగ్గరకు టీడీపీ ర్యాలీ చేరుకోగానే…ఒక్కసారిగా రాళ్లు, సీసాలు విసిరారు. తెలుగుదేశం కార్యకర్తలు ప్రతిఘటించే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల […]
పల్నాడు జిల్లా మాచర్ల రణరంగంగా మారింది. శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో దాడి చేశారు.
మాచర్లలో శుక్రవారం సాయంత్రం ఇదేం ఖర్మ…రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం కార్యకర్తలు స్థానిక రింగురోడ్డు నుంచి ప్రదర్శన చేపట్టారు.
ఈ క్రమంలో మున్సిపల్ ఆఫీసు దగ్గర వైసీపీ శ్రేణులు భారీగా మొహరించారు. చిన్న కాన్వెంట్ దగ్గరకు టీడీపీ ర్యాలీ చేరుకోగానే…ఒక్కసారిగా రాళ్లు, సీసాలు విసిరారు.
తెలుగుదేశం కార్యకర్తలు ప్రతిఘటించే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ పెరిగింది.
ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
గొడవ ముగిసిన తర్వాత అక్కడకు చేరుకున్న పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు.
తర్వాత రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీసుకు నిప్పు పెట్టారు.
దీంతో టీడీపీ నేతలకు చెందిన వాహనాలు దగ్ధమయ్యాయి. రాత్రి మాచర్లలోనే ఉండి ఎస్పీ రవి శంకర్ పరిస్థితి రివ్యూ చేశారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List