పసలేని ప్రసంగం ........ఊక దంపుడు ఉపన్యాసం ....కేసీఆర్ సభ పై కాంగ్రెస్ విసుర్లు ......మాయ మాటలు ఇక పనిచేయవు.

On

.....
రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, పాలనను నిర్వీర్యం చేసిన కేసీఆర్ మరోసారి బహిరంగంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారనీ కొడకండ్ల మండల కాంగ్రెస్ ఆరోపించింది పార్టీ అధికార ప్రతినిధి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేశ గాని నాగరాజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారావత్ సురేష్ నాయక్ జిల్లా కార్యదర్శి ధర్మరపు బిక్షపతి పట్టణ శాఖ అధ్యక్షులు మసురం రవీందర్  ల తో కలిసి సోమవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు ప్రజలు కేసీఆర్ బురిడిని తిప్పి కొట్టారన్నారు 
సభలో వందల కోట్ల రుపాయలు ఖర్చు చచేసినా హాళ్లు ఖాళీగా కనిపించాయంటే ప్రజల గుండె ధ్వని ఏమిటో స్పష్టం అవుతోందన్నారు 
పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ, కేసీఆర్ మాటలు మాత్రం ఇంకా హామీల మోతకే పరిమితమయ్యాయన్నారు  నిరుద్యోగ భృతి ఇవ్వడం, ధరణిలో అక్రమాలను పై స్పందించకపోవడం డబుల్ బెడ్ రూంలు నిర్మించడం లాంటి వాగ్దానాల గురించి ఒక్కమాట మాట్లాడలేదు.
"కాళేశ్వరం ముంపు కుంభకోణం గురించి ఒక్క మాటైనా చెప్పారా?", "రాష్ట్రంలో మిగిలిన అప్పులపై జవాబు చెప్పారా?" అంటూ వారు  నిలదీశారు.
ప్రజలు ఇప్పుడు  
"ఇంకా ఈ సభతో ప్రజలను మోసం చేయాలని చూస్తే, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని తిరస్కారమే ఎదురవుతుంది" వారన్నారు 
వరంగల్ గడ్డపై మీటింగ్ పెట్టారు అభివృద్ధి మాత్రం సిరిసిల్ల గజ్వేల్ సిద్దిపేటకు మీటింగ్ మాత్రం వరంగల్ లో పెట్టడం సిగ్గుచేటు అని వారన్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమాన్ని హేళన చేసి ఈరోజు లక్ష్మణ్ బాపూజీ పేరును ఎలా గుర్తు చేసుకుంటున్నారో ప్రజలు చూస్తున్నారన్నారు మిమ్మల్ని రాళ్లతో కొట్టే సమయానికి ఉద్యమాన్ని విద్యార్థులు కోదండరాం నెత్తిన వేసుకొని తెలంగాణ సాధించి రాళ్లదాడి నుండి మిమ్మల్ని తప్పించింది నిజం కాదా 
తెలంగాణ పదాన్ని నాటి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచ్చరించిన ప్రణయ భాస్కర్ ఆనాడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తే కేసీఆర్  ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఎందుకు స్పందించలేదు 
సకలజనుల సమ్మె సాగరహారం ట్యాంకుబండ్ ముట్టడి జరిగినప్పుడు బాష్పవాయువు  గోళాలతో  దాడులు జరిగినప్పుడు  దెబ్బలు తిన్నది విద్యార్థులు కోదండరాం మరిమీరు ఎందుకు ఆ  ఆ సభలలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు
తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ ను విలన్ అంటూ అబద్దాలతో కాలం గడుపుతున్న కేసీఆర్ గారు తెలంగాణకు అతిపెద్ద విలన్ మీ కుటుంబమే 
ఆమరణ నిరాహార దీక్షను మీరు ఎన్ని రోజులు చేశారు మీరు చేసిన దీక్షకు కేంద్రం నుంచి దూతగా ఎవరు వచ్చి  మీతో దీక్షను విరమింపజేశారు చెప్పండి 
మీరు చేసిన ఆమరణ నిరాహార దీక్ష తో  పొట్టి శ్రీరాములు గారు చేసిన ఆమరణ నిరాహార దీక్షకు విలువ లేకుండా పోతుంది
భారీ అవినీతికి పాల్పడేందుకే స్కెచ్ వేసి ప్రాజెక్టులు నిర్మాణం చేసి కాంట్రాక్టు పనులను ఆంధ్రులకు అప్పగించి కోట్లు కొల్లగొట్టుకున్నది మీరు మీ కుటుంబం కాదా రైతుబంధు మల్లారెడ్డి వారికే ఉపాధి అయింది కంటి వెలుగు చెరువుల చేపల పంపిణీ గొర్రెల పంపిణీ కాంట్రాక్టులు తమ పార్టీ కార్యకర్తలకే కేటాయించి దోచుకున్నది మీరు కాదా  గురుకులాలు కేజీ టు పేజీ ఏవి,  ధర్నా చౌక్ లు  ఎత్తివేసి ధర్నాలు మా  పరిపాలనలో లేవంటే ఎట్లా
సన్న వడ్లు పండించిన రైతులకు కింటాకు 500 చొప్పున బోనస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుంది మీ కార్యకర్తలకు మీకు పండించిన పంటకు రాకపోతే చెప్పండి అధికారులతో జరిగిన తప్పిదాన్ని సవరించి మీకు బోనస్ అందే విధంగా చూస్తాం అంతేకానీ సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ ఇవ్వడం లేదని మాయమాటలు చెబితే వినయ్ స్థితిలో రైతులు లేరన్న విషయాన్ని మీరు గ్రహించాలి కేసీఆర్ గారు 
మీ ప్రభుత్వ హయాంలో చేసిన కొద్దిపాటి పనులు ఒకే సంవత్సరంలో చేశారా కాంగ్రెస్ ప్రభుత్వానికి  ఐదు సంవత్సరాలు  సమయం ఉంది అంచలవారిగాఐదేళ్లలో అన్ని పనులు పూర్తి చేసి రానున్న ఎన్నికల్లోకి వెళ్తాం మరొకసారి అధికారంలోకి వస్తాం
అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తామని బాండ్ పేపర్లు రాసి ఇచ్చింది మీ బిజెపి పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బాండ్ పేపర్లు ఇవ్వలేదు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తుంది ఆ విషయాన్ని మీరు గ్రహించాలి రుణమాఫీ రెండు లక్షల లోపు ఉన్నవారికి మాఫీ చేయడం జరిగింది మీకు గాని మీ పార్టీ నాయకులకు గాని మాఫీ కాకుంటే వివరాలు అధికారులకు ఇవ్వండి మాఫీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటారు 
మహిళల ఉచిత బస్సుపై మీరు చేసిన కామెంట్లు మహిళలను ఎంతగానో ఆవేదనకు గురి చేశాయి  మహిళల ఉచిత ప్రయాణానికి బిఆర్ఎస్ వ్యతిరేకమా అనుకూలమా చెప్పండి
గడిచిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో  ప్రజలు బోల్తాపడ్డారని కేసీఆర్ అనడం విడ్డూరం బోల్తా పడింది ప్రజలు కాదు టిఆర్ఎస్ నాయకులే 100 ఎమ్మెల్యే స్థానాలు 16 ఎంపీ స్థానాలు గెలుస్తామని బోల్తా పడింది టిఆర్ఎస్ నాయకులు మాత్రమే 
ఉచిత కరెంటు కాంగ్రెస్ దే మిషన్ భగీరథ పూర్తి కాకుండానే ఓట్లు అడిగారు  అధికారులను అడ్డుపెట్టుకొని రెండోసారి అధికారాన్ని చేపట్టారు ఈరోజు పోలీసులను అధికారులను నిందిస్తున్నారు
హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్చినందుకు మీకు ఎందుకు బాధ
మీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పేరుతో భూములు అమ్మ లేదా మీరు భూములు  అమితే ఒకరు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మితే మరొక రూలా 
అభివృద్ధి పనుల కోసం నాడు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండి భూమిలో అమ్మినవారే 
ఉస్మానియా యూనివర్సిటీ భూములు అమ్మకానికి పెసర పెట్టింది మీరు కాదా విద్యార్థులు తిరుగుబాటు చేస్తే తోకముడిచి వెళ్లలేదా 
యాదగిరిగుట్ట అభివృద్ధి వెనుక భూ రియల్ మాఫియా లేదా గుట్ట చుట్టుపక్కల 30వేల  ఎకరాలకు పైగా భూములు మీ కుటుంబాలవి కావా 
మీ ప్రభుత్వ హాయంలో  మంత్రివర్గ విస్తరణ చేసిన వెంటనే హరీష్ రావుకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు ఏడాది పాటు ఎందుకు వెయిటింగ్ లో పెట్టారు
ఈటెల రాజేందర్ ను పార్టీ నుంచి ఎందుకు గెంటివేశారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను ఎందుకు తొలగించారు 
మీటింగ్ కు వస్తున్న ప్రైవేటు బస్సులను ప్రభుత్వం అడ్డుకొని నోటీసులు ఇస్తుందని చెప్పడం ఎంతవరకు సబబు రవాణా శాఖ ఆర్టీసీ సంస్థ బస్సులను ప్రభుత్వం మీ మీటింగుకు పంపించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసిన ఘనత ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ది మాత్రమే గత మీ ప్రభుత్వ హయాంలో తుక్కుగూడ రాహుల్ గాంధీ సమావేశానికి ఖమ్మం సమావేశాలకు బస్సులు అడుగుతే ఇవ్వకుండా ప్రైవేట్ బస్సులను రానివ్వకుండా ఇబ్బంది పెడితే ప్రజలే స్వచ్ఛందంగా సొంత వాహనాలలో వచ్చి మీకు బుద్ధి చెప్పింది నిజం కాదా
పోలీసులు జనాలను అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి దయాకర్ రావు పదేపదే మీటింగులో స్పందించడం సిగ్గుచేటు పోలీసులతో ఇతరుల సదస్సులు సమావేశాలను అడ్డుకున్న చరిత్ర దయాకర్ రావు 
నాడు టిఆర్ఎస్ పుట్టింది తెలంగాణ కోసం కాదు కేసీఆర్ టిఆర్ఎస్ ను పుట్టించింది రవాణా శాఖ మంత్రి పదవి కొరకు మాత్రమే నాటి చంద్రబాబు హయాంలో రవాణా శాఖ మంత్రి పదవి తిరిగి ఇవ్వలేదని పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం సాధించాలని పేరుతో పార్టీని పెట్టింది నిజం కాదా 
మీ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు కాంట్రాక్టర్లకు సర్పంచులకు ఏళ్ల తరబడి బిల్లులు ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేశారు చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కరినైనా పరామర్శించార ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఖమ్మం జిల్లా నుంచి ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ గుంజుకున్నప్పుడు గత 15లుగా మౌనంగా ఉండి ఏం చేశారు ఎందుకు స్పందించలేదు ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేదు 
రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లతో కలిసి పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నట్లు బహిరంగంగా చెప్పిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పైన చర్యలు తీసుకోకపోగా ఎందుకు సమర్థిస్తున్నారు 
మీ సమంత ఉత్తుత్తదే మీ ప్రసంగంలో పసలేదు అందుకే ప్రజలు మధ్య మధ్యలో గొడవకు దిగారన్న విషయాన్ని మీరు గుర్తించండి 
కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులలో మృతి చెందిన వారికి మీరు మౌనం పాటించడాన్ని మేము స్వాగతిస్తున్నాం
 అలాగే ఎస్ఎల్ బీసీ లో ప్రమాదం జరిగి గల్లంతయిన కార్మికుల పట్ల మీ స్పందన ఏమిటి మరణించిన కుటుంబాలకు ఎందుకు మౌనం పాటించలేదు
2018లో  మీ ప్రభుత్వ హయాంలో కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడి 63 మందికి పైగా చనిపోతే ఎందుకు మీరు పరామర్శించలేదు నిన్న జరిగిన సదస్సులో ఎందుకు మౌనం పాటించలేదు
 సభ విజయవంతనికి సహకరించారని తక్కలపల్లి రవీందర్ రావు  పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారి పేర్లు మాత్రమే చెప్పారు సభ విజయవంతంలో దయాకర్ రావు గారి పాత్ర లేదా మీ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నట్లు దూరమవుతున్నట్లు మీకు ఏమైనా సమాచారం ఉందా అందుకోసమే దయాకర్ రావు గారి పేరు  ప్రస్తించలేదా
గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ గౌరవ పరాజయానికి పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఒక సీటు కూడా రాకపోవడానికి కారణాలను ఈ సదస్సులో ఎందుకు విశ్లేషించలేదు మీరు ఒక్కసారి ఆత్మ విమర్శలు చేసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుచున్నాము ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరగాని క్రాంతి కుమార్
 కుందూరుఅమరేందర్ రెడ్డి అందే యాకయ్య 
పసునూరి మధుసూదన్ బత్తులవెంకన్న 
 అందే శ్రీవర్ణ 
గుంటుక తిరుపతమ్మ తిరుమనీ బిక్షం 
రాయపురం ఉప్పలయ్య గఫూర్ పాల్గొన్నారు

Views: 12
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News