దేశంలో తీవ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలి.
తీవ్రవాదుల దాడి హేయమైన చర్య. భూ భారతి దేశానికే రోల్ మోడల్. రైతులు, ప్రజలు భూ సమస్యలు పరిష్కరించేందుకే భూ భారతి చట్టం. భూ సమస్యలు లేని రాష్ట్రo గా తీర్చి దిద్దటమే లక్ష్యం.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 28, న్యూస్ ఇండియా : తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి దేశానికే రోల్ మోడల్ అని అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. సోమవారం హత్నూర మండలం లోని మంగపూర్ గ్రామం లోని ప్రైవేటు ఫంక్షనల్లో భూభారతి అవగాహన సదస్సుకు , అటవీ,దేవాదాయ ధర్మాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘు నందన్ రావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీ ఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు లతో కలసి పాల్గొన్నారు. దేశంలో తీవ్రవాదుల దాడికి నిరసనగా రెండు నిముషాల సమయం మౌనం పాటించారు. జ్యోతి ప్రజ్వలన చేసి భూ భారతి చట్టం అవగాహన సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా భూభారతి- నూతన ఆర్వోఆర్ చట్టానికి సంబంధించిన అంశాలు, మార్గదర్శకాలపై వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... దేశంలో తీవ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించలన్నారు. తీవ్ర వాదుల దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. దేశంలో తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వనికి తమ పార్టీ పూర్తి అండగా ఉంటుందని ఎంపీ రఘు నందన్ రావుకు తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టం ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరినప్పుడే దానికి సార్ధకత ఏర్పడుతుందని అన్నారు. రైతులు, ప్రజల మేలు కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో గ్రామ పరిపాలన అధికారులను ప్రభుత్వం నియమిస్తుందని తెలిపారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని అన్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి దేశానికే రోల్ మోడల్ అని అన్నారు. భూ భారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు, పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో జిల్లాలోని అన్ని మండలాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు - భూ భారతి చట్టం అని ఈ చట్టం లో హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చెయ్యడానికి ముందు భూముల సర్వే, మ్యాప్ తయారీ ,పెండింగ్ సాదాబైనామా ధరఖాస్తుల పరిష్కారం అవకాశం ఉందన్నారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేయాలని, భూమి హక్కులు మ్యుటేషన్ చేసి రికార్డులలో నమోదుకు, పాసు పుస్తకాలలో భూమి పటం ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. భూ సమస్యల పరిష్కారనికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ, వ్యక్తికి ఆధార్ భూమికి భూధార్ కార్డుల జారీ చేస్తున్నట్లు చట్టంలో ఉందని తెలిపారు. ఇంటి స్థలాలకు, ఆబాది,వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం ,గ్రామ రెవిన్యూ రికార్డుల నిర్వహణ, మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైన ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వర్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారన్నీ కూడా పొందుపరిచారని, రికార్డులో తప్పుల సవరణకు ,హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు కూడా అవకాశం ఉందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపీ రఘు నందన్ రావు మాట్లాడుతూ భూ భారతి చట్టం లో రైతులకు చట్టాలపై అవగాహన కల్పించి, భూ సమస్యలు లేకుండా చూడాలన్నారు. దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని వాటిలో 3 కోట్ల వరకు భూ సంబంధిత కేసులే ఉన్నాయన్నారు. భూ రికార్డులు డిజిటల్ గా మార్చాలని ,భూ భూధార్ లాంటివి గతంలో కేంద్ర ప్రభుత్వo నిర్ణయించిన కూడా అప్పటి ప్రభుత్వాలు అమలు చేయలేదన్నారు. గ్రామాల్లో ఉన్న గ్రామ కంఠం,అభది భూముల సర్వే జరగాలన్నారు. టి జి ఐ ఐ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ భూ భారతి చట్టం ఎంతో అనుభవజ్ఞులతో తయారు చేశారని, ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని, గతంలో పేద రైతులను న్యాయస్థానాల చుట్టూ తింపారని అని అన్నారు. ప్రజా పాలన అనంతరం రైతు సంక్షేమ కార్యక్రమాలు అనేకం జరిగాయన్నారు. రుణమాఫీ ,ఉచిత విద్యుత్ ,ఫ్రీ బస్ , 500 కే గ్యాస్ సిలిండర్, సన్నాళ్లకు బోనస్ ఇలాంటివి అమలు చేశారన్నారు. యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ రైతులు, ప్రతి ఒక్కరికీ నూతన చట్టం భూభారతి, దానిలోని అంశాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. జిల్లా స్థాయిలో రైతులకు, ప్రజలకు లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా న్యాయపరమైన సేవలు అందిస్తామన్నారు. ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే భూభారతిలో మూడంచెల అప్పీల్ వ్యవస్థ ఉందని కలెక్టర్ అన్నారు.ఇంతకు ముందు ఉన్న ధరణిలో కోల్పోయిన హక్కులు, కొత్త చట్టంలో ఎలాంటి హక్కులపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరు తమ తమ గ్రామాల్లో నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం గురించి ప్రజలకు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, మెదక్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి,అదనపు కలెక్టర్ మాధురి,ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి , తాసిల్దార్ పర్వీన్ షేక్, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comment List