సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.

సంగారెడ్డి జిల్లా గ్రంధాలయం లో సౌండ్ లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన.

On
సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 17, న్యూస్ ఇండియా : సమాజంలో అన్ని రకాల ప్రజలు సమానంగా జీవించాలని ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్  క్రాంతి వల్లూరు  అన్నారు. సంగారెడ్డి జిల్లా గ్రంధాల సంస్థ ఆవరణలో దివ్యాంగుల కోసం సౌండ్ లైబ్రరీ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సమాజంలో సమానంగా జీవించాలని ప్రభుత్వ లక్ష్యమని శారీరకంగా దివ్యాంగులుగా ఉన్నవారు కూడా మిగతా వారితో సమానంగా విద్యను సమాచారాన్ని పొందడానికి హక్కు కలిగి ఉన్నారన్నారు. అందుకోసం కంటి చూపు లేని దివ్యాంగుల కోసం మహిళా శిశు వికలాంగుల, వ్రయోవృద్ధుల,ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సౌండ్ లైబ్రరీ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సౌండ్ లైబ్రరీ లో సాంకేతిక సౌకర్యాలతో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఆడియో పుస్తకాలతో లైబ్రరీ పాఠశాలతో ప్రత్యేక రూపకల్పన చేసిన కంప్యూటర్లు వంటి సదుపాయాలతో దివ్యాంగులకు ఉపయోగంగా రూపొందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ లైబ్రరీ ద్వారా చదువును వినిపించి, దివ్యాంగులకు విజ్ఞానాన్ని చేరవేసే అవకాశం లభించనుందన్నారు. ఈ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ సూచించారు. పనులు నాణ్యత విషయంలో రాజీ పడకూడదన్నారు ఈ సౌండ్ లైబ్రరీ సమాజానికి ఒక స్ఫూర్తిదాయక మోడల్ గా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సౌండ్ లైబ్రరీ ఏర్పాటు కోసం బౌద్ధ మౌలిక సదుపాయాల ఏర్పడుతోపాటు వినికిడి ద్వారా విజ్ఞానం అందించే విధానాన్ని మరింత విస్తృతం చేయాలన్న లక్ష్యంతో ఈ లైబ్రరీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ లైబ్రరీ ఏర్పాటుతో జిల్లాలో ఉన్న అనేకమంది దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు పాఠకులకు ఉద్యోగాస్తులకు , విజ్ఞానార్జన పై ఆసక్తి ఉన్న వికలాంగుల ఇది ఆశాజనక మార్గం కానుంది అని కలెక్టర్ వల్లూరు బ్రాంచ్ తెలిపారు ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇలాంటి అవకాశాలను దివ్యాంగుల కోసం ఏర్పాటు చేయడం ద్వారా సమాజంలోని ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలని నిబద్ధతను కలెక్టర్ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి డిప్యూటీ ఇంజనీర్ దీపక్ డిసిపిఓ రత్నం వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ వెంకటేశం ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-04-17 at 6.35.26 PM

Views: 0
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News