డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.

On
డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 14, న్యూస్ ఇండియా : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రత్న, ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త, అంటరానితనం  నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడని శ్రీధర్ మహేంద్ర అన్నారు. సోమవారం రోజు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో భాగంగా అంబేద్కర్ విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డా. అంబేద్కర్ జయంతి సందర్బంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో ని పోతిరెడ్డి పల్లి వాసులు డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహంన్ని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు అంబేద్కర్ నూతన విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమం లో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్, సహా కార్యదర్శి గడ్డం పాండురంగం నరేష్ రాము, సుమన్, తదితరులు పాల్గొన్నారు.RTI Sridhar

Views: 2
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News