కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు 

అభినందించిన కలెక్టర్ జితేష్ పాటిల్

On
కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల

IMG-20241220-WA1206భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం పాటు వెంటిలేటర్ పై ఉన్న తల్లికి, అపస్మారక స్థితిలో పుట్టిన బిడ్డకి ఊపిరి అందించిన భద్రాచలం వైద్యులు మరియు వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అభినందనలు తెలిపారు. తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం వైద్య సిబ్బంది చూపించిన శ్రద్ధ పట్ల హర్షం వ్యక్తం చేశారు.వివరాల్లోకి వెళ్తే చర్ల మండలం రాళ్లపురం గ్రామానికి చెందిన 39 ఏళ్ల కుంజం ముయ్యమ్మ, ఈనెల 11 వ తారీఖున ప్రసవం కోసం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆమెకి తరచుగా తొమ్మిది మార్లు మూర్ఛ రాగా, అధిక రక్తపోటుతో అపస్పారక స్థితికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో మందులకు కూడా మూర్చ తగ్గకపోవటంతో తల్లిని సంరక్షించుటలో భాగంగా వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను డెలివరీ చేశారు. పుట్టిన బిడ్డ కూడా విగత జీవిగా పుట్టగా, భద్రాచలం వైద్యులు శ్రమించి ఆ బిడ్డకు ప్రాణం పోశారు. అపస్మారక స్థితిలో ఉన్న తల్లిని సైతం వెంటిలేటర్ పై ఉంచి వారం పాటు చికిత్స అందించారు. ఈనెల 19వ తారీఖున ఐసీయూ నుండి తల్లి బిడ్డలను క్షేమంగా డిస్చార్జ్ చేశారు. ఈ క్రమంలో ఎంతో శ్రమించి తల్లిని బిడ్డని కాపాడి ఊపిరి పోసిన ప్రసూతి వైద్యులైన డాక్టర్ ప్రమీల, డాక్టర్ సాత్విక మరియు మత్తువైద్యులైన డాక్టర్ నిఖిత మరియు పిల్లల వైద్యులైన డాక్టర్ మౌనిక, డాక్టర్ విజయ రావులను మరియు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రామకృష్ణ లను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మరియు డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు అభినందించారు.ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ఏజెన్సీ ప్రాంతంలో మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని జిల్లా కలెక్టర్ వైద్యులను సూచించారు.ఆసుపత్రుల రోగుల చికిత్స దృష్ట్యా ఎటువంటి అవసరాలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని సత్వరమే సమీక్షించి ఆ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Views: 68
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు  కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు 
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 
వేడుకలా జరిగిన పదోన్నతి సంబరాలు
అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 
అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!