అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!

ఫిజిక్స్ టీచర్, వార్డెన్ ఒత్తిడి వలన మా బాబు ఆత్మహత్య..

On
అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!

నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థి ఆత్మహత్య ..విద్యార్థి మృతి చెందిన విషయంపై గోప్యత పాటించిన స్కూల్ యజమాన్యం..హయత్ నగర్ నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం రాత్రి సంఘటన..అర్ధరాత్రి సమయంలో విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు..లక్షల్లో ఫీజులు వసూలు చేసి తన కొడుకు శవాన్ని అప్పగించారంటూ తండ్రి ఆవేదన...

అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!

నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థి ఆత్మహత్య 
విద్యార్థి మృతి చెందిన విషయంపై గోప్యత పాటించిన స్కూల్ యజమాన్యం
హయత్ నగర్ నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం రాత్రి సంఘటన
అర్ధరాత్రి సమయంలో విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు..
లక్షల్లో ఫీజులు వసూలు చేసి తన కొడుకు శవాన్ని అప్పగించారంటూ తండ్రి ఆవేదన...

ఎల్బీనగర్, డిసెంబర్ 17,

Screenshot_2024-12-17-09-13-55-59_7352322957d4404136654ef4adb64504
మృతుని ఫైల్ ఫోటో లోహితక్ష్య రెడ్డి..

న్యూస్ ఇండియా ప్రతినిధి..

అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎల్బీనగర్ డిసిపి జోన్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థ నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం రాత్రి ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఏడవ తరగతి విద్యార్థి హాస్టల్లోని తన రూమ్ లో ఉరివేసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. రాత్రి 8 గంటల సమయంలో సంఘటన చోటు చేసుకున్నప్పటికీ సుమారు రాత్రి 10 గంటల సమయంలో తోటి విద్యార్థులు హాస్టల్ రూమ్ కు వెళ్లిన సందర్భంలో వెలుగులోకి వచ్చిన సంఘటన. హయత్ నగర్ నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో అసలు ఏం జరుగుతుంది?. విద్యార్థులపై నారాయణ పాఠశాల నిర్వాహకుల యొక్క నిర్లక్ష్య ధోరణి మూలంగానే సంఘటన జరిగినట్లు అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహజంగా క్లాస్ రూమ్ కి వెళ్ళిన సందర్భంలో ఆ సెక్షన్ కి సంబంధించిన బాధ్యతలు విద్యార్థుల హాజర్ పై తనిఖీలు నిర్వహించాలి కానీ ఏడవ తరగతి విద్యార్థి మృతి చెందిన అంశంపై సహ తోటి విద్యార్థులు చెప్పే వరకు బాధ్యులు ఏం చేస్తున్నది ప్రధాన ప్రశ్నగా మారింది. వనపర్తి జిల్లా రేవల్లి మండలం శానాయిపల్లి గ్రామానికి చెందిన లోహితక్ష్య రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి ఏడవ తరగతి నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నాడు. హయత్ నగర్ పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న మృతుని కుటుంబ సభ్యులు పాఠశాల వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుని తండ్రి విలేకరులతో మాట్లాడుతూ...... లక్షల్లో ఫీజులు కట్టించుకున్న నారాయణ పాఠశాల యజమాన్యం తన కుమారుని మరణానికి కారణమైందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్ వేధింపుల మూలంగానే తన కొడుకు  తను చాలించాడని, స్కూల్ యజమాన్యంతో పాటు ఫిజిక్స్ లెక్చరర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దాదాపు 12 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కొడుకు మృతికి నారాయణ విద్యాసంస్థల కారణమైన తమకు కడుపుకో కడుపు కోత  మిగిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు మృతి చెందిన అంశంపై పాఠశాల యాజమాన్యం, నిర్వాకులు, పాఠశాల సిబ్బంది పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని, ఎంశంపై లోతైన విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని  ఆయన పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తమలాంటి బాధ మరీ కుటుంబానికి రావద్దు అని, తన కొడుకు మృతి చెందిన అంశంపై లోతరణ లోతైన విచారణ చేయాలని మృతుని కుటుంబ సభ్యులతో పాటు బంధువులు డిమాండ్ చేశారు.

Views: 108

About The Author

Post Comment

Comment List

Latest News

కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు  కొన ఊపిరితో ఉన్న తల్లి బిడ్డల"ప్రాణాలు"కాపాడిన వైద్యులు 
భద్రాచలం (న్యూస్ఇండియా నరేష్)డిసెంబర్ 21:ప్రసవ వేదనలో భద్రాచలం ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చి మూర్ఛకి లోనై, అపస్మారక స్థితిలో కొన ఊపిరితో బిడ్డకు జన్మనిచ్చి సుమారు వారం...
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
మాల మహానాడు ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మకు  ఉరి 
నాలుగు రోజులు బ్యాంకు సేవలు రద్దు 
వేడుకలా జరిగిన పదోన్నతి సంబరాలు
అటో  డ్రైవర్లకు పోలీసుల అవగాహన సదస్సు 
అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!