హైదరాబాద్ నగరంలో రెచ్చిపోతున్న దొంగల ముఠా...
జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి....
హైదరాబాద్ నగరంలో రెచ్చిపోతున్న దొంగల ముఠా...
జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి....
ఎల్బీనగర్, డిసెంబర్ 10 న్యూస్ ఇండియా ప్రతినిధి...
ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ లోని పవిత్రమైన అయ్యప్ప దేవాలయంలో దొంగల ముఠా హల్చల్ చేసింది. అయ్యప్ప దేవాలయంలోకి ప్రవేశించి సీ.సీ కెమెరాలకు తన ఆనవాళ్లు కనపడకుండా మరయు తన ముఖచిత్రం కనపడకుండా మాస్కు, చేతులకు గ్లౌస్ ధరించి ఆలయంలోకి ప్రవేశించి సుమారు రాత్రి 12 గంటల సమయం నుండి రెండు గంటల వరకు గుడిలోనే ఉండి దొంగతనానికి పాల్పడ్డాడు. ఆలయ నిర్వాహకులు సమాచారం ఇవ్వడంతో స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి, చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి స్పందించి అక్కడికి చేరుకొని సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారాన్ని అందజేశారు. దొంగలు గుడిలోనికి వెనకాల నుంచి ప్రవేశించారని గుర్తించారు. హుండీలోని డబ్బులను దొంగిలించాలని ప్రయత్నించాడు అన్నట్లు (పోలీస్ క్లూస్ టీం) వారు అనుమానిస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ కి సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. అడిషనల్ ఏసిపి కోటేశ్వరరావు, ఎల్బీనగర్ సి.ఐ, ఎస్.ఐ లు స్పందించారు.
Comment List