ఫోర్జరీ సంతకాలతో కార్మికులను మోసం చేసిన ఐఎన్టియుసి

అధికారి సంతకం, సింగరేణి ముద్ర లేని ఆథరైజేషన్ లేఖలను ఎలా అనుమతించారు..?

On
ఫోర్జరీ సంతకాలతో కార్మికులను మోసం చేసిన ఐఎన్టియుసి

వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యదర్శి వంగా వెంకట్

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్ ) డిసెంబర్ 3:ఫోర్జరీ సంతకాలతో సభ్యత్వ అంగీకార పత్రాలు సమర్పించి ఐఎన్టియుసి సంఘం ఆర్ధికదోపిడిని ప్రారంభించిందని, దీనిపై సింగరేణి యాజమాన్యం స్పందించి తక్షణమే రికవరీకి నిలుపుదల చేసి కార్మికులకు న్యాయం చేయాలనీ సింగరేణి గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కేంద్రకమిటీ కార్యదర్శి వంగా వెంకట్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ కార్యాలయం

IMG-20241203-WA1399శేషగిరిభవన్లో  మంగళవారం వారు మాట్లాడుతూ గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు కార్మికుడి అనుమతితో ఆథరైజేషన్ లెటర్ ద్వారా ప్రతినెలా వేతనంనుంచి రికవరీ చేసి సంఘాల ఖాతాలో జమచేయాల్సి ఉంటుందని, ఇందుకు విరుద్దంగా ఐఎన్టియుసి సంఘం అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ముద్రించిన ఆథరైజెషన్ లేటర్లలు యాజమాన్యానికి సమర్పిస్తే సింగరేణి యాజమాన్యం ముద్ర, పర్సనల్ జనరల్ మేనేజర్ సంతకంచేసిన అనంతరం యూనియన్లకు అందించిన తర్వాత కార్మికనుంచి సంతకం తీసుకొని యాజమాన్యానికి సమర్పించాల్సి ఉంటుందని, ఆ లేఖల ద్వారా నెలకు ఆ కార్మికుల నుంచి రూ.యాభై చొప్పున రికవరీ చేసి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల ఖాతాల్లో జమచేయాల్సి ఉంటుందన్నారు. దీనికి భిన్నంగా అధికారుల సంతకం, సింగరేణి యాజమాన్యం ముద్ర లేకుండానే ముందస్తుగా కార్మికుల సంతకాలతో సమర్పిస్తే రెండు నెలలకు సంబంధించి సభ్యత్వం రికవరీ చేశారని ఇది సరైంది కాదన్నారు. ఫోర్జరీ సంతకాలు, అధికారి సంతకం, సింగరేణి స్టాంపు లేకుండా రికవరీ చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, దీనిపై విచారణ జరిపి నష్టపోయిన కార్మికులకు న్యాయం చేయాలనీ, రికవరీ చేసిన సొమ్మును తిరిగి కార్మికుల ఖాతాలలో జమచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కేంద్ర కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి జి వీరాస్వామి, కొత్తగూడెం, కార్పొరేట్ బ్రాంచిల కార్యదర్శులు వట్టికొండ మల్లికార్జున్ రావు, రమణమూర్తి, నాయకులూ కె రాములు, సందెబోయిన శ్రీనివాస్, గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Views: 66
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News