బాల్య వివాహ విముక్త భారత్' అవగాహన సదస్సు

తెలంగాణ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల మరియు జూనియర్ కాలేజ్ నందు

By Venkat
On
బాల్య  వివాహ విముక్త భారత్' అవగాహన సదస్సు

ముఖ్య అతిథి సెక్రటరీ విక్రమ్

జనగామ జిల్లాలో పెంబర్తి గ్రామంలో గల తెలంగాణ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల మరియు జూనియర్ కాలేజ్ నందు scope ఎన్జీవో సంస్థ మరియు జిల్లా బాలల పరిరక్షణ విభాగం మేడం సంయుక్తంగా బాల్య వివాహ విముక్త భారత్' అవగాహన సదస్సును scope ngo చైర్మన్ Dr.Saiayyana ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథి గా DLSA సెక్రటరీ విక్రమ్ హాజరయ్యారు. DLSA సెక్రెటరీ విక్రమ్ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ బాల్యంలో వివాహం చేసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎదుగుదల ఉండదని, చిన్న వయసులోనే అనారోగ్యాలకు గురవుతారని ,అలాగే ప్రతి కుటుంబంలో కూడా బాల్య వివాహాలపై, 2006 బాల్యవివాహాల నిరోధక చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు , జనగామ జిల్లాను బాల్య వివాహాలు లేని జిల్లా దిశగా అందరూ కలసి కట్టుగా పనిచేయాలని సూచించారు. DWO శ్రీమతి ఫ్లోరెన్స్ మాట్లాడుతూ, విద్యార్థిని విద్యార్థులకు బాలల హక్కులు, వారి బాధ్యతలు తెలుసుకొని భవిష్యత్తు ఉన్నతంగా రూపొందించుకోవాలన్నారు, ప్రభుత్వం పిల్లలు అందించే సంక్షేమ కార్యక్రమాలను ఉపయోగించు కోవాలని కోరారు , బాల్య వివాహం వల్ల జరిగే అనర్ధాలు గురించి వివరించారు.బాల్యంలో విద్యపై ఆసక్తి కలిగి ఉండాలని,ప్రాపంచిక విషయాలపై దృష్టి పెట్టకుండా, నిరంతరం లక్ష్యసాధన దిశగా కృషి చేయాలన్నారు.ఈ సమావేశంలో బాల్య వివాహ నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని అధికారులు , విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ చైర్ పర్సన్ ఉప్పలయ్య, జిల్లా బాలల పరిరక్షణ అధికారి L.రవికాంత్,చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ రవికుమార్ , స్కోప్ ఎన్జీవో చైర్మన్ బండి సాయన్న గౌడ్ , పాఠశాల ప్రిన్సిపాల్ రుక్సానా , స్కోప్ NGO జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ మనోజ్ కుమార్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ రవీందర్ సిబంది, తబసుమ్, తరుణ్, పద్మ, లావణ్య విద్యార్దులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొనడం జరిగింది.IMG-20241127-WA0469

Views: 4
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List