జనగామ జిల్లా పాలకుర్తి లో యంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సమావేశాలు
నవంబర్ 29,30 తేదీలలో
రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
*రాజ్యాధికారం లోకి ఉత్పత్తి శక్తులు రావాలి
*రాష్ట్ర కమిటీ సమావేశం లో కార్యాచరణ
*రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
నవంబర్ 29, 30 తేదీలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుల పురిటిగడ్డ
చిట్యాల అయిలమ్మ, దొడ్డి కొమురయ్య లు నడియాడిన జనగామ జిల్లా పాలకుర్తి శుభం పంక్షన్ హల్ లో యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం లు జరుగుతున్నాయి అని ఈ సమావేశం లు విజయవంతం చేయాలని యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపు నిచ్చారు.
ది:- 27-11-2024 రోజున రాష్ట్ర కార్యాలయం ఓంకార్ భవన్ నుంచి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో
ఈ సమావేశం ఉత్పత్తి శక్తులు అయిన కష్టజీవుల రాజ్యాధికారం లోకి వచ్చినపుడు మాత్రమే సంపద సమాన పంపిని జరుగుతుంది అని అపుడు మాత్రమే సమాజం లో అసమానతలు రూపుమాపడానికి మార్గం ఏర్పడుతుంది అని ఇందు కోసం యంసిపిఐ(యు) నిరంతరం కృషి చేస్తున్నది అని ఈ సమావేశం లో అందుకోసం నిర్ణయం లు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.
ఇప్పడికె తెలంగాణ రాష్ట్రం లో రాజకీయ ప్రత్యామ్నాయం గా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (BLF) ఏర్పడి పని చేస్తుంది అని గత శాసనసభ ఎన్నికల్లో ఏ పాలకవర్గ పార్టీతో పొత్తు లేకుండా ప్రత్యామ్నాయం గా పోటీ లో నిలిచింది అని ఇదే సరైన మార్గం అని యంసిపిఐ(యు) విశ్వసిస్తు అందుకు కలిసి వచ్చే శక్తులతో కలిసి రాజ్యాధికారం కోసం కృషి చేస్తున్నదని, రాజ్యాధికారం కోసం ప్రజా పోరాటాలకు సమాయత్తం కావడానికి ఈ రాష్ట్ర కమిటీ సమావేశం లో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.విప్లవ వందనాలతో వనం సుధాకర్ యంసిపిఐ (యు)
రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
Comment List