పిఆర్టియు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పొంగులేటి
కొత్తగూడెం(న్యూస్ఇండియా నరేష్)నవంబర్ 23: తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గాజులరాం బస్తి భజన మందిర్ ఎదురుగా ఏర్పాటు చేసిన పిఆర్టియు టీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భవన నిర్మాణ భూమిపూజ ,శంకుస్థాపనను చేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు డి. వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బి.రవి, సంగమేశ్వర రావు, జాంగిర్ షరీఫ్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు వై వెంకటేశ్వర్లు, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ మెంబర్ శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ సభ్యులు నాగ సీతారాములు, పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు, చీకటి కార్తీక్, ఊకంటి గోపాలరావు, 35 వార్డు కౌన్సిలర్ బండారి రుక్మేందర్, మరియు పిఆర్టియు నాయకులు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Comment List