పోలీస్ స్టేషన్ లో కేసులు అంటే ఆషా మాషి కాదు... అనవసరంగా ఎవ్వరు గొడవపడొద్దు...!
ప్రజలకు అవగాహనా కల్పించిన ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఎం ఉపేంద్ర బాబు...
- కార్యక్రమంలో కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి ఏ మంజునాథ్ పెద్దకడుబూరు ఎస్సై నిరంజన్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
న్యూస్ ఇండియా/ పెద్దకడుబూరు మండలం నవంబర్ 11 :- కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండల పరిధిలోని పెద్దకడుబూరు మరియు కల్లుకుంట గ్రామాలను ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఎం ఉపేంద్ర బాబు సోమవారం సందర్శించారు. గ్రామ ప్రజలతో ఆయన సమావేశం ఏర్పరిచి ప్రజలు గొడవలు కొట్లాటలకు దూరంగా ఉండాలని కేసులు నమోదు కావడం వల్ల ఏ విధంగా నష్టపోతారో పూర్తిగా వివరంగా తెలియజేశారు. గొడవపడే ముందు కొద్దిసేపు ఆలోచన చేస్తే దాదాపు చాలా వరకు నేరాలు తగ్గుతాయని చెప్పారు. దానితో పాటు వాహనాలు నడిపినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని రోడ్డు ప్రమాదాలు నివారించాలని అలాగే ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి అవగాహన లేకుండా చాలామంది మోసపోతున్నారు కాబట్టి ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీలు అడగడం, పార్ట్ టైం జాబు చేయమనడం వంటి వాటికి రెస్పాన్స్ ఇవ్వరాదని , మోసపోయిన వారు వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేసి వారి యొక్క ఫిర్యాదు నమోదు చేయవలసిందిగా తెలియజేశారు. డిఎస్పి గారితో పాటు కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి ఏ మంజునాథ్ పెద్దకడూరు ఎస్సై నిరంజన్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comment List