పోటాపోటీగా కొనసాగుతున్న క్రికెట్ పోటీలు

మొదటి మ్యాచ్ ఉపాధ్యాయుల విజయం

On
పోటాపోటీగా కొనసాగుతున్న క్రికెట్ పోటీలు

రెండో మ్యాచ్ చాతకొండ బెటాలియన్-6 విజయం

IMG20241109094407కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్ నవంబర్ 9: డాక్టర్ బి.ఎస్.రావు క్రికెట్ టోర్నమెంట్ రెండో రోజు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో పోటా పోటీగా క్రికెట్ మ్యాచ్ లు కొనసాగాయి. మొదటి మ్యాచ్ మీడియా-2 జట్టు మరియు ఉపాధ్యాయుల జట్టు మధ్య మ్యాచ్ కొనసాగింది. మీడియా-2 జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 109/7 పరుగులు సాధించి ,110 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉపాధ్యాయుల జట్టు ముందు ఉంచింది. ఉపాధ్యాయల జట్టు 113/3 పరుగులు సాధించి సునాయాస విజయాన్ని సొంతం చేసుకుంది. మీడియా-2 జట్టు నుంచి హనుమ (35), దశరథ్ (31) పరుగులు సాధించారు. ఉపాధ్యాయ జట్టు నుంచి రామకృష్ణ (45), శోభన్(43) పరుగులు సాధించి జట్టుకు విజయని అందించారు. అనంతరం రెండో మ్యాచ్లో చాతకొండ బెటాలియన్-6 జట్టు మరియు ఉపాధ్యాయుల జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బెటాలియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 164/6 పరుగులు సాధించింది.165 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉపాధ్యాయల జట్టు ముందు ఉంచింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఉపాధ్యాయల జట్టు158/4 పరుగులతో నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేసి అనవసరమైన పరుగుల కోసం ప్రయత్నం చేసి, 7 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. బెటాలియన్ జట్టు తరఫున రామ్ బ్రహ్మం( కెప్టెన్)-50,గణేష్ (40) పరుగులు సాధించి బెటాలియన్ జట్టుకు మంచి స్కోర్ను అందించారు. ఉపాధ్యాయల జట్టు నుంచి రామకృష్ణ (53), నరేష్ (31) పరుగులు సాధించి మంచి తోడ్పాటునందించిన గాని ఓటమి చవిచూసింది.

 

Read More  ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక

 

Read More  ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక

 

Read More  ఘనంగా క్రిస్మస్ గాస్పల్ వేడుక

Views: 8
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List