ఆదివాసి ప్రజలకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తాం
టేకులపల్లి సిఐ సురేష్, ఆళ్లపల్లి ఎస్సై రితీష్
ఆళ్లపల్లి పరిధిలో వైద్య శిబిరం
కొత్తగూడెం (న్యూస్ ఇండియా) నవంబర్7: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు ఆళ్లపల్లి మండల పరిధిలోని బూస్రాయి గుత్తికోయ గ్రామాన్ని గురువారం ఆళ్లపల్లి పోలీసులు సందర్శించారు. వలస ఆదివాసి ప్రజలు నివసిస్తున్న ఈ గ్రామంలో మలేరియా,డెంగ్యూ లాంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయని సమాచారాన్ని తెలుసుకొని అక్కడ వైద్య శిబిరాన్ని నిర్వహించారు.గ్రామంలోని ప్రజలకు పలు రకాల వైద్య పరీక్షలు చేయించి, ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగిందని టేకులపల్లి సిఐ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆయన మాట్లాడుతూ ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు.వలస ఆదివాసీల సంక్షేమం,అభివృద్ధికి కోసం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సారథ్యంలో ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటామని సూచించారు. వైద్య పరీక్షల అనంతరం కొంతమందిని తదుపరి పరీక్షల కోసం టేకులపల్లి రావాల్సింది కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆళ్లపల్లి ఎస్సై రితీష్ మరియు టి ఎస్ ఎస్ పి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Comment List