ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...

పోస్టర్ ఆవిష్కరణ...ట్రాక్టర్ లతో ర్యాలీ...

By Ramesh
On
ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...

న్యూస్ ఇండియా తెలుగు, నవంబర్ 06 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

IMG_20241106_174035

ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించి, ర్యాలీ నిర్వహించారు.ఆనంతరం యూనియన్ అధ్యక్షులు బొడిగం శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ..‌ప్రతి సంవత్సరం నవంబర్ 6 న ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.రైతు లేనిదే రాజ్యం లేదు అని రైతు జీవితంలో ట్రాక్టర్ భాగమైందని,గతంలో ఎద్దులతో వ్యవసాయ పనులు చేపట్టేవారని,ట్రాక్టర్లు మార్కెట్లోకి ప్రవేశించాక ,రైతులు ట్రాక్టర్ లతో వ్యవసాయం చేయడం మొదలుపెట్టి,ట్రాక్టర్తో కొద్దిపాటి సమయంలో కొన్ని ఎకరాల మేర పొలం సాగుకు సిద్ధం చేస్తున్నారని,పత్తి, వరి తదితర చేలలో క్రిమిసంహారక మందుల పిచికారీకి సైతం వాడుతున్నారని,వరికోతలకు హార్వేస్టర్ వినియోగిస్తున్నారని.ఒక్కోగ్రామంలో సుమారుగా 40 నుంచి 50 వరకు ట్రాక్టర్లు ఉన్నాయని,ఫ్రంట్ బ్లేడ్, వరికోసే యంత్రాలు సైతం ఉన్నాయని, పొలం పనులే కాకుండా ట్రాక్టర్ వినియోగంతో మరెన్నో కమర్షియల్ పనులు చేస్తున్నారని, ఇంటి నిర్మాణానికి ఇసుక, కంకర, మొరం, ఇటుక తదితర ముడి సరుకుల రవాణకు ట్రాక్టర్ల వాడకం పెరిగిందన్నారు.అనంతరం స్వీట్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు రావుల శ్రీకాంత్ రెడ్డి, వడ్లకొండ రవికుమార్, రావుల భాస్కర్ రెడ్డి, రావుల క్రాంతి కుమార్, పిట్టల రమేష్, ఇండ్ల భాస్కర్, ఇండ్ల సూరి, బియ్య వెంకటేష్, జేరిపోతుల బాబు, జేరిపోతుల శ్రీకాంత్, ఒగ్గు సిద్ధులు, పిట్టల విగ్నేష్, గాగిల్లపురం సత్తయ్య, యూనియన్ సభ్యులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

IMG_20241106_083701

Read More సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన బోనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Views: 256
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List