పహిల్వాన్ పూర్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

ఏజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు

పహిల్వాన్ పూర్ లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

 

వలిగొండ మండల పరిధిలోని పహిల్వాన్ పురం గ్రామంలో ఏజెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా రమేష్ కలాబృందంచే జానపద కళాకారులు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు.మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి. సాయంత్రం అంతా ఒక్క చోట చేరి బతుకమ్మ పాటలతో హోరెత్తించారు.యువతులు, చిన్నారులు ఆడిపాడుతూ సందడి చేశారు.ఈ సందర్బంగా ఏజెఆర్ ఫౌండేషన్ ఛైర్మెన్ ఎలిమినేటి జంగారెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈఏట కూడా ఒకరోజు ముందుగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ, గ్రామ ప్రజలందరికీ బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు అనంతరం బతుకమ్మలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో యువతులు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.Screenshot_20241009_222537~2

Views: 382

Post Comment

Comment List

Latest News