పీ ఆర్ టీ యు టీ ఎస్ 35 వ స్టేట్ కౌన్సిల్ సమావేశాలు

ఎస్ ఎన్ ఆర్ పుష్ప కన్వెన్షన్ హాల్ కీసర హైదరాబాదు

By Venkat
On
పీ ఆర్ టీ యు టీ ఎస్  35 వ స్టేట్ కౌన్సిల్ సమావేశాలు

రాష్ట్ర శాఖకు రాష్ట్ర అసోసియేట్ సభ్యులు

పీ ఆర్ టీ యు టీ ఎస్ 35 వ స్టేట్ కౌన్సిల్ సమావేశాలు ఎస్ ఎన్ ఆర్ పుష్ప కన్వెన్షన్ హాల్ కీసర హైదరాబాదు నందు ఈ రోజు జరిగిన కార్యవర్గ సమావేశంలో పెండింగ్ లో ఉన్న ఐదు డి ఏ లను వెంటనే ప్రకటించాలని, పిఆర్సి నివేదిక తెప్పించుకొని 50% పెట్మెంటుతో పిఆర్సి ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే చెల్లించాలని, ఎస్ జీ టి లకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు హక్కు కల్పించాలని, ప్రభుత్వం ప్రారంభించబోయే ఇంటర్నేషనల్ స్కూల్స్ లలో ప్రమోషన్ ద్వారా సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులను తీసుకోవాలని తీర్మానాలను ఆమోదించారని పాలకుర్తి మండల శాఖ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శిలు శ్రీ వైకాని వెంకన్న, వడ్లకొండ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇట్టి కార్యవర్గ సమావేశంలో పాలకుర్తి మండలం నుంచి రాష్ట్ర శాఖకు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా కూటి కంటి సోమయ్య తీగల శ్రీనివాసరావు తిరునగరి నిర్మల, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మారేపల్లి కవిత, రోండ్ల రణధీర్ రెడ్డి భీరంవెంకటరెడ్డి, ఆకుల సరిత, కొట్టే రామానుజన్, రాష్ట్ర కార్యదర్శిగా వడిచెర్ల సుధాకర్ ఎన్నికైనట్టు తెలిపారు.తమను రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించినందుకు ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డికి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డికి, జనగామ జిల్లా శాఖ అధ్యక్షులు కొల్ల మహిపాల్ రెడ్డికి,నూకల ఎల్లారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.IMG-20241008-WA0445

Views: 46
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News