ఘనంగా HRCCI తెలంగాణ రాష్ట్ర సదస్సు
ఈరోజు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర సదస్సు హైదరాబాదులోని హయత్ నగర్ లో ఘనంగా జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హెచ్ ఆర్ సిసీఐ జాతీయ అధ్యక్షులు శ్రీ సింగమల వెంకటరమణయ్య మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దబ్బేటి శ్రీనివాసరావు, హాజరైయ్యారు అనంతరం ఈ సంస్థ వల్ల ప్రజలకు మరింత సేవలందించేందుకు 'ప్రశ్నించే హక్కు' పేరుతో దినపత్రికను సింగమల వెంకటరమణయ్య గారి చేతుల మీదుగా రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ కమిటీ సభ్యులు విధిగా సంస్థ నిబంధనలకు లోబడి పని చేయాలని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా పనిచేస్తూ ప్రజలకు కావలసిన హక్కులపై అధికారులతో సమీక్షించి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పనిచేసే బాధ్యత మనది అని అన్నారు, మానవ హక్కులపై ఎంతటి వారినైనా ప్రశ్నించి ప్రజల తరఫున శ్రమించి వారికి అండగా నిలబడి చట్టపరమైన న్యాయం జరిగే వరకూ పోరాడాలని అన్నారు, అనంతరం దబ్బెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సంస్థ యొక్క విధి విధానాలను కమిటీ సభ్యులకు తెలియపరుస్తూ సంస్థకు చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమాలకు తావివ్వకుండా చూడాలన్నారు, సమస్యతో వచ్చిన బాధితుల దగ్గర ఫిర్యాదు కచ్చితంగా తీసుకోవాలని ఫిర్యాదు లేనిదే అధికారుల వద్దకు వెళ్ళవద్దని వారితో అమర్యాదగా ప్రవర్తించొద్దని చక్కగా హక్కులను వివరించి న్యాయం జరిపించాలని, బాధితుల వద్ద ఎలాంటి రుసుము డిమాండ్ చేయవద్దని అన్నారు, ఈ సంస్థకు లోబడి పని చేయకుండా డబ్బు సంపాదన ధ్యేయంగా పనిచేసే వారి ఐడి కార్డులను తొలగించే పూర్తి బాధ్యత జాతీయ అధ్యక్షులకు ఉందని గుర్తు చేశారు, ఈ సంస్థ తెలుగు దినపత్రిక రెండు రాష్ట్రాల్లో ప్రారంభించబోతున్నామని ఈ పత్రికలో నిజాలు నిర్భయంగా రాయవచ్చని సరైన ఆధారాలు లేకుండా వార్తలు రాసి పేపర్ కు చెడ్డపేరు తేవద్దని, ఈ పేపర్ కు జిల్లాల వారీగా విలేకరులను సమకూర్చుకొని విజయవంతం చేయాలని కోరారు.
Comment List