పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి అడుగుజాడల్లో నడుచుకోవాలి

జనతా పార్టీ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి

On
పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి అడుగుజాడల్లో నడుచుకోవాలి

టేక్మాల్ మండల కేంద్రంలోనీ బీజేపీ కార్యాలయంలో ఉపాధ్యక్షులు రాములు ఆధ్వర్యంలో

 జనతా పార్టీ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి కార్యక్రమం టేక్మాల్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఉపాధ్యక్షులు వడ్డె రాములు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండిత్ దీన్ దయాళ్ ఉపాద్యాయ గారు ప్రవచించిన, నిర్దేశించిన మార్గం అంత్యోదయతో ప్రభుత్వ ఫలాలు అట్టడుగు వర్గానికి చెందిన అత్యంత చివరి వ్యక్తి వరకు చేరుకోవాలన్న దృఢ సంకల్పం బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో సమర్థవంతంగా కొనసాగుతుందన్న విశ్వాసం సమాజంలో కనిపిస్తుంది. పండిట్ దీన్ దయాల్ జీ స్ఫూర్తితో సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు భారతదేశాన్ని ప్రపంచంలోనే పరమ వైభవ స్థితిలో ఉంచేందుకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో విశేష కృషి భవిష్యత్తులో నిర్మాణం అవుతూనే ఉంటుంది అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లుపేట రాజు, ప్రధాన కార్యదర్శి సిద్ధిరాములు, భూత్ అధ్యక్షులు మంగళి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Post Comment

Comment List

Latest News