వరద బాధితులకు సింగరేణి ఉద్యోగుల విరాళం
సీఎం రేవంత్ రెడ్డికి 10.25 కోట్ల చెక్కును అందజేత
డిప్యూటీ సీఎం సమక్షంలో అందజేసిన సింగరేణి సీఎండి, గుర్తింపు సంఘం నాయకులు ప్రభుత్వం
సింగరేణి భవన్(న్యూస్ ఇండియా బ్యూరో నరేష్)సెప్టెంబరు 19:తెలంగాణ వరద బాధితుల కోసం సింగరేణి కాలరీస్ అధికారులు, ఉద్యోగులు తమ ఒకరోజు బేసిక్ జీతం 10.25 కోట్ల ను విరాళంగా ప్రకటించారు. ఈ చెక్కును గురువారం రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి ఎనర్జీ సెక్రటరీ రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు, అధికారుల సంఘం నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్ ప్రసాద్, లక్ష్మీపతి గౌడ్ తదితరులు అందజేశారు.వరద తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రం ప్రభుత్వం తీసుకుంటున్న సహాయ చర్యలకు తోడ్పాటుగా ఈ వితరణ ప్రకటించామని, గతంలో కూడా పలు ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విరాళాలు అందజేశామని వారు పేర్కొన్నారు.సింగరేణి ఉద్యోగులు, అధికారులు తమ ఒకరోజు బేసిక్ వేతనాన్ని వరద బాధితుల కోసం విరాళంగా అందజేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమ అభినందనలు తెలిపారు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.ఈకార్యక్రమంలో ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కె.రాజ్ కుమార్, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ సి.త్యాగరాజన్, అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ నర్సింహులు, జీఎం(కో ఆర్డినేషన్) ఎస్.డి ఎం.సుభాని, జీఎం(పర్సనల్) కవితా నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comment List