మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల...ఒక నిండు ప్రాణం బలి

ఆ కుటుంబాన్ని ఆదుకునేది ఎవరు

మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల...ఒక నిండు ప్రాణం బలి

మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల...ఒక నిండు ప్రాణం బలి

తొర్రూరు నుండి కంటాయపలెం వెళ్లే రహదారిపై రోడ్డుకు ఇరువైపులా చెత్తచెదరం

మున్సిపాలిటీ బండి నుండి జారిపడి పతపరుపు వల్లే మృతి

తెల్లరేసరికి చాట్ మాటుగా పరుపు తీసేసిన మున్సిపల్ సిబ్బంది

Read More అయ్యో నారాయణ.... నారాయణ.... ఇదేం ఘోరం...!!

ఆ కుటుంబాన్ని ఆదుకునేది ఎవరు

IMG_20240914_135936


మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడు ఈరబోయిన రమేష్ (35) అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల నుండి ఉపాధి హామీ పథకం సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ గా కంట్టాయపలెం గ్రామంలో విధులు నిర్వహిస్తు శుక్రవారం రోజున తొర్రూర్ మండలం లోని ఎంపీడీవో కార్యాలయానికి విధులు నిర్వహించడానికి వచ్చి వెళ్తున్న క్రమంలో మున్సిపాలిటీ అధికారులు చెత్త తరలించే ట్రాక్టర్ పై నుండి కింద పడ్డ వ్యర్థపరుపు ద్విచక్ర వాహనం కి తట్టుకొని కింద పడటం వలన సాయంత్రం 7.30 గంటలకు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వల్లే నా భర్త ప్రాణాలు కోల్పోయాడని బాధితురాలు ఈరబోయిన రచన(25),ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుని కుటుంబానికి సరైన ఇల్లు కూడా లేకపోవడం,అదేవిధంగా మృతునికి ఇద్దరు ఆడ పిల్లలు (పెద్ద అమ్మాయి)మహన్విత(4) (చిన్న అమ్మాయి)ఆరాధ్య(2) ఉండగా చిన్నమ్మాయి ఆరాధ్య కు హార్ట్ డిసీజ్ ఉంది అని మృతుని భార్య తెలిపారు. మున్సిపల్ అధికారులు రోడ్డుపై చెత్త వేయకపోతే నా భర్త ప్రాణాలతో ఉండేవాడని నా కుటుంబానికి నా పిల్లలకి ఎప్పటికీ అండగా ఉండేవాడని అన్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే నా భర్త చనిపోయడని నా కుటుంబం పరిస్థితి దీనస్థితిలో ఉంది కాబట్టి నా భర్త చావుకు కారణమైన మున్సిపల్ అధికారులే నాన్ను నా కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితురాలు అన్నారు. మరియు పాలకుర్తి నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే స్పందించి వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Views: 440
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News