సిపిఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్
నోటి మాటలతో కడుపు నిండదు-జాతీయ విపత్తుగా ప్రకటించాలి
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
భద్రాద్రి కొత్తగూడెం : సిపిఐ పార్టీ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోటి మాటలతో వరద బాధితుల కడుపు నిండదని ఘాటుగా విమర్శించారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులను, ఆదుకోవాలని అలాగే ఇళ్లల్లోకి వరద వచ్చి నష్టపోయిన వరద ముంపు కుటుంబాలను కూడా ఆదుకోవాలని అన్నారు. పంట నష్టం ఎకరానికి30000 వేల రూపాయలు, ఇంటి నష్టానికి 50,000 ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటల ఉపకరణానికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా , రైతు సంఘాల నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు ,ముంపు ప్రాంతాల బాధితులు రైతులు, తదితరులు పాల్గొన్నారు .
Comment List