భూ సమస్యల పరిష్కారం కోసం లీపు సంస్థ కృషి అభినందనీయం.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషను చైర్మన్ ముదిరెడ్డి కోదండ రెడ్డి
భూమి సునీల్ ఖుషి మరువలేనిది...
భూ సమస్యల పరిష్కారం కోసం లిప్ సంస్థ తయారుచేసిన బుక్కును ఆర్డీవో కు అందజేత...
యాచారం సెప్టెంబర్ 11 న్యూస్ ఇండియా ప్రతినిధి:
యాచారం మండలంను లిప్ సంస్థ పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని భూ సమస్యలపై అధ్యయనం చేసి నివేదిక తయారు చేయడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదన్ రెడ్డి అన్నారు. బుధవారం యాచారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో రెవెన్యూ అధికారులు,రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ యాచారం మండలం దత్తత తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని మండలంలోని 10 గ్రామాలలో భూ సమస్యలపై పూర్తిగా అధ్యయనం చేశారని అన్నారు. భూమి సునీల్ వారి బృందానికి కోదండ రెడ్డి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. వారి అధ్యయనంలో గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో అనేకమంది రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఎంతోమందికి పట్టాదారు పాసుబుక్ పుస్తకాలు రాక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ధరణి తప్పులు తడకగా ఉందని వారి అధ్యయనంలో వెళ్ళడైందని తెలిపారు. భూమి సునీల్ పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని చేసిన ఈ అధ్యయనాన్ని ఈ నివేదికను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి త్వరలో స్వీకారం చుట్టనున్నారని తెలిపారు. రైతులందరూ ఓపిక పట్టి సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తూ అధికారులకు పూర్తి సహకారాలు అందించాలని అన్నారు. అనంతరం భూమి సునీల్ మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రత్యేకమైన శ్రద్ధతో పరిష్కరించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని అన్నారు. సర్వే అధ్యయనం సందర్భంగా గ్రామాల్లోని రైతులందరూ అధికారులు అందరూ సహకరించాలని అన్నారు వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డిఓ అనంతరెడ్డి, యాచారం తహశీల్దార్ అయ్యప్ప, రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వుప్పల భాస్కర్ గుప్తా, వెంకట్ రెడ్డి, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List