తొర్రూరు ప్రైవేట్ పి యస్ ఆర్ స్కూల్లో   ఫీ... జులుం....

సెకండ్ టర్మ్ ఫీజు కట్టలేదని విద్యార్థులను ఎండలో నిలబెట్టిన స్కూల్ యాజమాన్యం..... ఎండ దెబ్బకు విద్యార్థి స్పృహ తప్పిపోయిన వైనం..

తొర్రూరు ప్రైవేట్ పి యస్ ఆర్ స్కూల్లో   ఫీ... జులుం....

తొర్రూరు ప్రైవేట్ పి యస్ ఆర్ స్కూల్లో   ఫీ... జులుం....

సెకండ్ టర్మ్ ఫీజు కట్టలేదని విద్యార్థులను ఎండలో నిలబెట్టిన స్కూల్ యాజమాన్యం

ఎండ దెబ్బకు విద్యార్థి స్పృహ తప్పిపోయిన వైనం.......

*అదేంటని అడిగిన తల్లిదండ్రులను బెదిరించిన స్కూలు యాజమాన్యం.....

Read More గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గా ఆడారి నాగరాజు

విషయం తెలుసుకుని వెళ్లిన విలేకరుల పై దురుసుగా మాట్లాడిన ప్రిన్సిపల్ బీణ మేడం......

Read More ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్  దక్షిణ భారత ఇంఛార్జ్ "మాచన"..

ప్రైవేట్ స్కూల్లో యాజమాన్యానికి అడ్డు అదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులపై విద్యార్థుల తల్లిదండ్రులపై దురుసుగా ప్రవర్తిస్తూ.... విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక ఫీజుల భారం మోపుతూ .... విద్యార్థులను ఇబ్బంది పెడుతూ.... ఇలా ఎందుకు పెట్టారని విద్యార్థుల తల్లిదండ్రులు అడిగినందుకు వారిపై దురుసుగా ప్రవర్తిస్తూ... ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం తీరు మారడం  లేదని ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పాలకేంద్రం వెలికట్ట శివారులో ఉన్నటువంటి పీఎస్ఆర్ స్కూలు యాజమాన్యం విద్యార్థుల పట్ల విద్యార్థి తల్లిదండ్రుల పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఫీజుల విషయంలో నానా రకముల ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేశారు స్కూల్ ప్రారంభమైనప్పటి నుండి ఫీజులు కడుతున్నామని ఫీజు కట్టి మూడు నెలలు కూడా కాలేదు ఇప్పటికే మూడు వంతులలో ఒక వంతు ఫీజు కట్టినా కూడా 70% ఫీజు చెల్లించాలని చెల్లించని ఎడల  విద్యార్థులను ఎండలో నిలబెట్టి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు నాలుగు రోజుల గడు అడిగినా కూడా ఇవ్వకుండా నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థిని పొద్దున ఫస్ట్ పిరియడ్ నుండి నాలుగో పీరియడ్ వరకు ఎండలో నిలబెట్టారని ఆ విద్యార్థి పొద్దున పాలు మాత్రమే తాగి వచ్చాడని విద్యార్థి తండ్రి లంచ్ బాక్స్ తీసుకొచ్చేసరికి తన కొడుకుని ఎండలో నిలబెట్టడం వలన  ఆకలితో తన కుమారుడు కళ్ళు తిరిగి కింద పడిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా మా బాబును ఎండల ఎందుకు నిలబెట్టారు అని స్కూల్ యాజమాన్యం అని అడిగితే ఫీజు కట్టేంతవరకు మేము అలాగే నిలబెడతామని సమాధానం ఇచ్చానని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఒకవేళ మా పిల్లలకు ఏమైనా జరిగితే ఎలా అని ప్రశ్నించగా పాఠశాల యాజమాన్యం సోమేశ్వరరావు విద్యార్థికి ఏమైనా అయితే మేము చూసుకుంటామని మీరు మాత్రం కచ్చితంగా ఫీజు కట్ట వలసిందేనని దురుసుగా మాట్లాడాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో కూడా ఇదే పాఠశాలలో స్కూల్ ఫీజు విషయంలలో...బొమ్మకల్లు గ్రామం కన్యాతాండకు  చెందిన నాలుగో తరగతి విద్యార్థిని ఫీజుల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తే స్కూలు బిల్డింగ్ పై నుండి దూకి చనిపోయిన సంఘటనలు అందరికీ తెలిసినవే అయినా కూడా పి ఎస్ ఆర్  స్కూలు యాజమాన్యం మాటతీరులో చేత తీరులో మార్పు రావడంలేదని వీరిని ఎవరు ఏమి చేయలేరనే భావన  ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి స్కూలు యాజమాన్యాన్ని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఇలాంటి స్కూల్లో పర్మిషన్ రద్దుచేసి స్కూళ్లను మూసివేయాలని ఇంకోసారి ఇలాంటి సంఘటనలు ఏ ప్రైవేట్ స్కూళ్లలో  జరగకుండా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరారు.

Read More పాత పింఛను పథకం సాధనే ధ్యేయం...

Views: 1427
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News